Sajjala: ఐఎంజీ భారత్ సంస్థ పేరిట రూ.లక్ష కోట్ల కుంభకోణం.. చంద్రబాబు స్కెచ్ ఇదే.. చంద్రబాబు అప్పట్లోనే ఐఎంజీ భారత్ సంస్థ పేరిట రూ.లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు సజ్జల. చంద్రబాబు నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం మొత్తం మీద 850 ఎకరాలు ఐఎంజీ భారత్ కు కట్టబెట్టిందన్నారు. అమరావతిలోనూ అలాంటి కుంభకోణానికే తెరలేపారని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 08 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Sajjala: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక ఇంటర్నేషనల్ స్కామర్ అని ఆరోపించారు. ఐఎంజీ తరహాలోనే అమరావతిలోనూ చంద్రబాబు భారీ దోపిడీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి దేనికైనా సమర్థుడని.. గుడిని, గుడిలోని లింగాన్ని స్వాహా చేయగలిగిన వ్యక్తి అని కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం మొత్తం మీద 850 ఎకరాలు ఐఎంజీ భారత్ కు కట్టబెట్టిందని విమర్శలు గుప్పించారు. ఈ భూములు ఉన్న చోట ఇప్పుడు ఎకరం రూ.100 కోట్లు పలుకుతోందని.. ఆ లెక్కన రూ.80 వేల కోట్ల నుంచి, రూ.1 లక్ష కోట్లకు 20 ఏళ్ల క్రితం స్కెచ్ వేసిన ఘనాపాఠీ, గజ దొంగ చంద్రబాబని ఆరోపించారు. అసలు ఈ వర్ణనలు కూడా చంద్రబాబుకు సరిపోవేమోనని కామెంట్స్ చేశారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా, కోర్ ఏరియా పేరిట ఊరూపేరూ లేని సంస్థను పట్టుకొచ్చి దాదాపు 1700 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు పలు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారని వ్యాఖ్యానించారు. Also Read: విశాఖలో విషాదం..తండ్రి చనిపోయినా వెనకడుగు వెయ్యని విద్యార్థిని..! ఈ 1700 ఎకరాల పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలని.. అందులో ముఖ్యమంత్రి నివాసం, గవర్నర్ నివాసం, అసెంబ్లీ, సచివాలయం.. అన్నీ ఈ స్టార్టప్ ఏరియా పక్కన రావాలని.. ఇది డెవలప్ అయిన తర్వాత మిగిలి వన్నీ రావాలని.. అందుకు అవసరమైన మౌలిక వసతులను కూడా రూ. 5,500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే రెండేళ్లలో నిర్మించి ఇవ్వాలని.. ఆ సంస్థ తన కార్యకలాపాలు పూర్తి చేసుకునేందుకు ఐదేళ్ల చొప్పున మూడు విడతల్లో 15 ఏళ్ల సమయం కేటాయిస్తుందని.. నాడు ఐఎంజీ స్కాం ఎలా చేశారో, ఇక్కడ రాజధాని పేరుతో రైతుల ఉసురు కొట్టుకుంటూ తన బినామీలనో, తనతో చీకటి ఒప్పందాలు చేసుకున్న సంస్థలకో భూములు అప్పగించి స్కాం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి నారాయణ 58 ఎకరాలు కొన్నది కూడా ఇక్కడేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోందని తెలిపారు. మొదట 3 వేల ఎకరాలు అనుకున్నారు కానీ, ఎందుకో 1700 ఎకరాలకు దిగారన్నారు. ఐఎంజీ భూముల విషయంలో ఎలా చేశారో ఇక్కడ రూ.40 వేల కోట్లో, రూ.50 వేల కోట్లో మింగేయొచ్చనేది వాళ్ల ఆలోచనని వ్యాఖ్యానించారు. ఎక్కడైనా భూములు డెవలప్ మెంట్ కు ఇస్తే మౌలిక సదుపాయాలు వాళ్లే ఏర్పాటు చేసుకుంటారని.. ప్రభుత్వానికే సొమ్ము ఎదురు చెల్లిస్తారన్నారు. కానీ ఇక్కడ అంతా ఉల్టా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ స్కాం కూడా ఇలాంటిదేనని సజ్జల వివరించారు. #ap-ex-cm-chandrababu #sajjala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి