Sajjala: గెట్ రెడీ ఫర్ సెలబ్రేషన్స్.. వైసీపీ నేతలకు సజ్జల పిలుపు..!

రేపు కౌంటింగ్ రోజున వైసీపీ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల మరోసారి స్పష్టం చేశారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Sajjala: గెట్ రెడీ ఫర్ సెలబ్రేషన్స్.. వైసీపీ నేతలకు సజ్జల పిలుపు..!
New Update

Sajjala Ramakrishna Reddy : వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని.. పార్టీ శ్రేణులు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక్క ఓటు కూడా మిస్ మాచ్ అవ్వకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిపారు. అంతేకాకుండా 10:30 గంటలకు సంబరాలకు సిద్ధం అవ్వండి అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదన్నారు.

కొత్త నిబంధనలు..

పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తన నిర్ణయాలను తామే ఉల్లంగిస్తారా? అని ప్రశ్నించారు. దేశం అంతా ఒక రూల్ ఏపీలో ఒక రూల్ ఎంటని.. పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు తీసుకురావడం ఎంటని నిలదీశారు. ఏపీలో ఒక్క చోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై ప్రత్యేక వెసులు బాటు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.

భ్రమలో ఉన్నారు..

ఎన్నికల కమిషన్ ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమి కాదని విమర్శలు గుప్పించారు. ఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారని కామెంట్స్ చేశారు. చంద్రబాబు స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయట పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు.!


సీఈఓను బెదిరించి..

బీజేపీ జాతీయ వ్యూహాలను ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారని.. వైసీపీ బలమైన పార్టీ అని.. రెచ్చగొట్టల్సిన అవసరం వైసీపీకి లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతా యుతంగా ఉన్నామని అన్నారు. సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు.

పొంతన లేని ఎగ్జిట్ పోల్స్..

చంద్రబాబు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యిందని.. 21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వచ్చిందని.. ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారని ఎగతాలి చేశారు. పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. నార్త్ లో బీజేపీ పోతుందని సౌత్‌లో తెచ్చుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు.

అసత్యా ప్రచారం..

సౌత్‌లో సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నారని కామెంట్స్ చేశారు. తాము జనంతో ఉన్నామని.. మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదన్నారు. ఎన్నికల్లో ల్యాండ్ టైటలింగ్ గురించి లేని పోనీ అసత్యాలు ప్రచారం చేసారని ఫైర్ అయ్యారు.

#sajjala-ramakrishna-reddy #ap-election-counting-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe