Sajjala: మీ డ్రామాలు ఆపండి.. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా: సజ్జల సంచలన వాఖ్యలు

టీడీపీ డ్రామాలు పీక్స్ కి చేరాయని మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్టెరాయిడ్స్ ఇచ్చి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని లోకేష్ అవాస్తవాలు చెప్తున్నాడంటూ ధ్వజమెత్తారు. కిడ్నీ ఫెయిల్ అని, బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ లు పెట్టడానికి..ప్రపంచంలో ఎక్కడా లేని హక్కు చంద్రబాబుకి ఇవ్వాలని దబాయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

New Update
Sajjala: మీ డ్రామాలు ఆపండి.. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా: సజ్జల సంచలన వాఖ్యలు

Sajjala: టీడీపీ నేతలపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ డ్రామాలు పీక్స్ కి చేరాయని మంత్రి సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్టెరాయిడ్స్ ఇచ్చి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని లోకేష్ అవాస్తవాలు చెప్తున్నాడంటూ ధ్వజమెత్తారు. కిడ్నీ ఫెయిల్ అని, బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ లు పెట్టడానికి..ప్రపంచంలో ఎక్కడా లేని హక్కు చంద్రబాబుకి ఇవ్వాలని దబాయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

అన్ని సుఖాలు ఉంటే ఇంక జైలు ఎందుకు..? అని ప్రశ్నించారు మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు కేజీ బరువు పెరిగినట్లు జైలు అధికారులు చెప్తున్నారని అన్నారు. రాజమండ్రిలో టెంపరేచర్ పెరిగితే అందరికీ ఇబ్బందిగానే ఉంటుందని వ్యాఖ్యనించారు. చంద్రబాబుకి అవసరం లేకపోయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక వసతులు కల్పించారని చెప్పారు. ప్రత్యేక ఖైదీలకు ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ వసతులు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. అన్ని వసతులు కల్పిస్తున్నప్పట్టికి ఇప్పుడే ఇంకో గంటలో చంద్రబాబు పోయేలా ఉన్నారన్నట్టు టీడీపీ నేతలు హడావిడి చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబుకి స్కిన్ అలర్జీ ఉందని.. డెర్మటాలజిస్టులు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. చంద్రబాబుకి ఏదో అయిపోతుంది అని సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఒకడు బయలుదేరాడని అన్నారు మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి.చంద్రబాబుకి ఇంటి నుండే ఆహారం వస్తుంది.. త్రాగు నీరు ఇంటి నుండే వస్తుంది..ఇంటి నుండి వచ్చే ఆహారంలో స్వల్ప అనారోగ్యం వచ్చేలా ఏమైనా చేస్తున్నారేమో..? అని ఆరోపించారు మంత్రి సజ్జల. స్వల్ప అనారోగ్యం పేరుతో బయటకి తీసుకుని రావాలని చూస్తున్నారెమో అని అన్నారు. ఆసుపత్రి పేరుతో హైదరాబాద్ తీసుకుని వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యనించారు.

Also Read: చంద్రబాబుకు పెట్టే భోజనంపై నాకు అనుమానం ఉంది: మంత్రి అమర్నాథ్ సంచలన ఆరోపణ

Advertisment
తాజా కథనాలు