Sajjala: ఏం తప్పుగా మాట్లాడాను?.. చిరంజీవి గొప్ప నటుడే.. కానీ..! చిరంజీవిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు సజ్జల. చిరంజీవి గొప్ప నటుడే.. కానీ, ఆయన బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. By Jyoshna Sappogula 22 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Sajjala Ramakrishna Reddy : 2024 ఎన్నికలను ప్రహసనంగా మార్చాలన్న ప్రయత్నం జరుగుతుందన్నారు వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నాటి కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శలు గుప్పించారు. టీడీపీ (TDP) అభ్యర్థులను బీజేపీ (BJP) అభ్యర్థులుగా పోటీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఏమి కర్మ పట్టిందని ఇలా టీడీపీ నేతలకు బీజేపీ కండువా వేసి అనపర్తిలో పోటీ చేయిస్తున్నారని ప్రశ్నించారు. జనసేన దారిలోనే.. అవనిగడ్డ, పాలకొండ, భీమవరం టీడీపీ అభ్యర్థులు జనసేన పార్టీ (Janasena Party) తరఫున పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికలు అంటే కూటమి పార్టీలకు ప్రహసనంగా మారిందని దుయ్యబట్టారు. వేరే పార్టీల వాళ్ళని పిలిచి కండువా కప్పి పార్టీలో పోటీ చేయిస్తే ఇంకా వాళ్ళకి ఉన్న విశ్వసనీయత ఏమిటని ప్రశ్నించారు. జనసేన పార్టీకి చంద్రబాబు ఫైనల్ గా ఇచ్చింది 10 సీట్లేనని ఎద్దేవా చేశారు. బి ఫార్మ్ ఇచ్చే వరకు ఎవరు పోటీ చేస్తారో కూడా డౌట్ అని కౌంటర్ వేశారు. జనసేన పార్టీ దారిలోనే బీజేపీ కూడా పోతుందన్నారు. Also read: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..! పంచ పాండవుల కథ.. సీట్లు బీజేపీవీ అయితే పోటీ చేసే నేతలు అంతా టీడీపీ వాళ్ళేనని అన్నారు. మూడు పార్టీల పొత్తు చూస్తుంటే పంచ పాండవుల మంచం కోళ్ల కథ గుర్తొస్తుందన్నారు. పేరుకే పొత్తు.. సీట్లన్నీ చంద్రబాబు చేతుల్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కూడా చంద్రబాబు పొత్తులు పెడతాడన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఒంటరిగా డీ కొట్టలేమనీ కూటమి నేతలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారని కామెంట్స్ చేశారు. తప్పు ఏముంది? ఈ క్రమంలోనే చిరంజీవిపై తాను మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని ప్రశ్నించారు సజ్జల. చిరంజీవి (Chiranjeevi) కూటమికి మద్దతు తెలపడం మంచిదేనన్నాను. అయితే, తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. పంచ తంత్రం క్యారెక్టర్స్ అన్ని పొత్తులో ఉన్న పార్టీలో ఉన్నాయన్నారు. తాను చిరంజీవిని అవమణించేలా ఎప్పుడు మాట్లాడలేదని స్పష్టం చేశారు. చిరంజీవి ఒక మంచి నటుడు, గొప్పవాడని అయితే..బాంక్యులు దివాల తీసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని గెలిపించాలని చిరంజీవి చెప్పాడన్నారు. మరి అలాంటి వ్యక్తులను గెలిపించాలని అడిగినపుడు తాము ఏమి మాట్లాడాలో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. తన వ్యాఖ్యలపై స్పందించి పవన్ కళ్యాణ్ తన స్థాయి తగ్గించుకున్నాడని దుయ్యబట్టారు. చిలక పలుకులు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక నాయకురాలు షర్మిల అన్నారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాలో షర్మిలను నియమించారని.. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలను ఏపీకి పంపారన్నారు. చంద్రబాబు కోసం షర్మిల చిలక పలుకులు పలుతున్నారన్నారు. ఆమె ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరూ మాట్లాడీస్తున్నారు.. అందరికీ తెలిసిందేనన్నారు. #chiranjeevi #sajjala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి