సాయిధరమ్ తేజ్ కు అభిమాని కౌంటర్.. గట్టి వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో.!

సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ స్పెల్లింగ్ ను రిలబ్లిక్ గా టైప్ చేశారు. దీంతో,ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా అంటూ ప్రశ్నించాడు ఓ అభిమాని. తేజ్ స్పందిస్తూ..తమ స్కూల్లో తమకు గౌరవం కూడా నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించారా? నేర్పించకపోతే నేర్చుకో అని గట్టిగా బదులిచ్చాడు.

సాయిధరమ్ తేజ్ కు అభిమాని కౌంటర్.. గట్టి వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో.!
New Update

Sai Dharam Tej: టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన అభిమానులతో తాజాగా చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ..మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్రలు ఏమిటిని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా తనకు బాగా సంతృప్తిని ఇచ్చినవి చిత్రలహరి (Chitralahari), రిపబ్లిక్ (Republic) సినిమాలను తెలిపాడు. అయితే, రిపబ్లిక్ స్పెల్లింగ్ ను బై మిస్టేక్ గా రిలబ్లిక్ అని పెట్టాడు మెగా హీరో. దీంతో, ఓ నెటిజన్ సెటైరిక్ గా రిప్లై ఇచ్చాడు. అది రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్ ..ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా? అని ప్రశ్నించాడు.


నెటిజన్ వేసిన కౌంటర్ కు మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తనదైన స్టైల్ లో గట్టిగా బుద్ధి చెప్పారు. తమ స్కూల్లో తమకు గౌరవం కూడా నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించారా? అని ప్రశ్నించాడు. నేర్పించకపోతే నేర్చుకో అని స్ట్రాంగ్ గా బదులిచ్చాడు. దీనికి సదరు నెటిజెన్ స్పందిస్తూ..నన్ను క్షమించు అన్నా.. నీవు రిప్లై ఇవ్వవనే అలా పెట్టాను అని బదులిచ్చాడు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2014 నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. ఆ  తర్వాత వరుస సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Also Read: “ఇంకోసారి ఎవ్వరి మీద ఇలాంటి మాటలు చెప్పకు”.. రతికకు అమర్ వార్నింగ్..!

ఇక ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏండ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన అభిమానులతో ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ నిర్వహించారు.  #AskSDT పేరుతో అభిమానులతో మాట్లాడారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ప్రస్తుతం 'గాంజా శంకర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

#sai-dharam-tej #hero-sai-dharam-tej
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe