/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-43-3.jpg)
Sai Dharam Tej About Srikanth Movie : మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఓ బాలీవుడ్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆ మూవీ క్లైమాక్స్ తనను తీవ్ర భావోద్వేగానికి గురి చేసిందని అన్నాడు. తేజు సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ మెగా హీరోను అంతలా టచ్ చేసిన సినిమా మరేదో కాదు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన 'శ్రీకాంత్'..
తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా 'శ్రీకాంత్' అనే సినిమా తెరకెక్కింది. రేసెంట్ గా థియేటర్స్ లో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చింది. తాజాగా ఈ సినిమాను సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నాడు.
Watched this beautiful film #Srikanth inspired by the life story of our very own Telugu Icon @SrikanthBolla_ Garu
You're truly a HERO sir @RajkummarRao sir,
What a brilliant performance you've delivered.
You've bought life to this sweet & inspiring story.The climax has put… pic.twitter.com/jvWXmyHZ87
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 17, 2024
Also Read : వివాదంలో చిక్కుకున్న’డబుల్ ఇస్మార్ట్’ సాంగ్.. పూరీ జగన్నాథ్ పై కేసీఆర్ ఫ్యాన్స్ ఫైర్!
"తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘శ్రీకాంత్’ చూశా. ఇదొక అపురూప చిత్రం. రాజ్‌కుమార్ రావ్.. మీ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. మీ నటనతో ఈ స్ఫూర్తిదాయక కథకు జీవం పోశారు. క్లైమాక్స్ చూసి నా కళ్లు చెమర్చాయి. ఆ సన్నివేశాలు నన్ను ఆలోచింపచేశాయి. శరద్ ఖేల్కర్, జ్యోతిక పెర్ఫార్మెన్స్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రేట్ వర్క్ తుషార్ హిద్రానీ" అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.