సహార గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతారాయ్ మంగళవారం ముంబైలో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమాచారం ప్రకారం సుబ్రతా రాయ్ భౌతికకాయాన్ని బుధవారం లక్నోలోని సహార నగరానికి తీసుకురానున్నారు. అక్కడ ఆయనకు చివరిసారి నివాళులర్పిస్తారు.
1948లో బెంగాళీ కుటుంబంలో జన్మించారు సుబ్రతారాయ్. సహారా ఇండియా పరివార్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ఎడిటర్, చైర్మన్. ప్రపంచానికి ఆయన సహారశ్రీ అనే పేరుతో పరిచయం. సుబ్రతారాయ్ 1978లో సహార ఇండియా పరివార్ ను స్థాపించారు. సహారా ఇండియా వ్యాపరం 2000లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సయమంలో ఒక రిపోర్టులో భారతీయ రైల్వే తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి సంస్థగా అభివర్ణించారు.
సహార ఇండియా కూడా ఐపీఎల్ పుణే వారియర్స్ ఇండియా పేరుతో ఒక జట్టును కొనుగోలు చేసింది. తర్వాత బీసీసీఐ తో విభేదా లకారణంగా ఈ ప్రాంచైజీని రద్దుచేసుకుంది. ఇది కాకుండా సుబ్రతారాయ్ గ్రో స్వెనర్ హౌజ్ ఎంబీ వ్యాలీసిటీ ప్లాజా హోటల్, డ్రీమ్ డౌన్ టౌన్ హోటల్స్ కు యజమాని.
సుబ్రతారాయ్ మరణం పట్ల సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ ద్వారా సంతాపం ప్రకటించింది. సహరాశ్రీ సుబ్రతారాయ్ జీ మరణం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నామంటూ ట్వీట్ చేశారు.