/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T160402.117-jpg.webp)
Safety Measures During Earthquake :మనం మన పనిలో ఉంటాం.. సడన్‌గా టేబుల్ కదులుతుంది.. ఫ్యాన్ ఊగుతుంది.. కిటికిలు కొట్టుకుంటాయి.. ఇంట్లోని సామాన్లు పడిపోతుంటాయ్.. వెంటనే బుర్రకు తడుతుంది.. ఇది భూకంపమని(Earthquake).. ఏం చేయాలో అర్థంకాదు.. కాళ్లు, చేతులు గజగజా వణికిపోతాయి.. ఎటు పరిగెత్తాలో తెలియదు.. ఎక్కడ తలదాచుకోవాలో దిక్కుతోచదు.. ఒక్క నిమిషం ఆగండి.. కంగారుపడకండి.. భూకంపం వస్తే ఏం చేయాలో మేం మీకు చెబుతాం.. ముందు కూల్‌గా ఉండండి..!
తైవాన్ భూకంపం
తైవాన్(Taiwan) లో సంభవించిన భారీ భూకంపం దాటికి పలు వంతెనలు, ఫ్లైఓవర్లు కదిలిపోయాయి. రిక్టార్ స్కెల్‌పై 7.7 తీవ్రతతో తైవాన్‌లో వచ్చిన ఈ భూకంపం 25 ఏళ్లలో అత్యంత బలమైనది.. ఇప్పటికే పలువురు ప్రాణాలు విడిచారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. అటు జపాన్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి.. ఇది సునామీ హెచ్చరికలకు దారి తీసింది. ఇంతకీ భూకంపం వస్తే ఏం చేయాలి?
భూకంపం సమయంలో ఏం చేయాలి?
➼భయాందోళనకు గురికావద్దు:
భూకంపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. పరిగెత్తడం లేదా అరవడం మానుకోండి, ఎందుకంటే ఇది గందరగోళాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని, ఇతరులను ప్రమాదంలో పడేస్తుంది. బదులుగా, కదలకుండా ఉండండి. వణుకు ఆగిపోయే వరకు వేచి ఉండండి.
➼భవనం లోపల ఉండవద్దు:
భూకంపం సమయంలో మీరు ఇంటి లోపల ఉంటే, కిటికీలు భారీ ఫర్నిచర్‌కు దూరంగా సురక్షితమైన ప్రదేశానికి వెళ్లండి. మీరు ఒక భవనం పైఅంతస్తులో ఉంటే కింది ఫ్లోర్‌కు వెళ్లండి. దృఢమైన టేబుల్ లేదా డెస్క్ కింద ఆశ్రయం పొందండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T160635.844-jpg.webp)
➼ బయటకు కూడా పరిగెత్తవద్దు:
భూకంపం సంభవించినప్పుడు బయటకు పరిగెత్తడం సురక్షితమైన పని అని చాలా మంది నమ్ముతారు. అయితే, ప్రతీసారి నిజం కాదు. భూకంపం సమయంలో పడిపోయిన శిథిలాలు, పగిలిన అద్దాలు, ఇతర ప్రమాదకర వస్తువులు ఉంటాయి. ఈ సమయంలో బయటకు పరిగెత్తడం ప్రమాదకరం.
➼ ఎలివేటర్లను ఉపయోగించవద్దు:
భూకంపం వచ్చినప్పుడు ఎలివేటర్ల(Elevators) ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి పనిచేయవు, అంతస్తుల మధ్య ఇరుక్కుపోతాయి. భవనాన్ని ఖాళీ చేయడానికి మెట్లను ఉపయోగించండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T160412.111-jpg.webp)
➼ కిటికీల దగ్గర ఉండొద్దు:
భూకంపం సంభవించినప్పుడు, కిటికీలు పగిలిపోతాయి. దీనివల్ల తీవ్రమైన గాయాలు అవుతాయి. కిటికీలు, గాజు తలుపులు లాంటి వస్తువులకు దూరంగా ఉండండి.
➼ అగ్గిపెట్టెలు లేదా లైటర్లను ఉపయోగించవద్దు:
భూకంపం తరువాత, గ్యాస్ లైన్లు దెబ్బతినవచ్చు.. అప్పుడు గ్యాస్ లీక్(Gas Leak) అయ్యే ప్రమాదం ఉంది. అగ్గిపెట్టెలు లేదా లైటర్లను ఉపయోగించడం వల్ల మంటలు చెలరేగుతాయి. ఇది మరింత నష్టం, ప్రమాదాన్ని కలిగిస్తుంది.
➼ విద్యుత్ తీగలను తాకవద్దు:
నేలపై విద్యుత్ తీగలు లేదా స్తంభానికి వేలాడుతూ కనిపిస్తే వాటిని తాకవద్దు. ఇది విద్యుదాఘాతానికి కారణమవుతుంది.
Also Read: Priyanka Jain : సారీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము.. వైరలవుతున్న ప్రియాంక జైన్ పోస్ట్..!
Follow Us