శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించిన లెజెండరీ ప్లేయర్. ఆయన బయోపిక్‌గా '800' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ముంబైలో లాంఛ్ చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ విడుదల చేసేది ఎవరో తెలుసా? గ్రౌండ్‌లో ముత్తయ్య ప్రత్యర్థి అయిన క్రికెట్ గాడ్, లెజండరీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ ఓ వీడియో విడుదల చేసింది.
గ్రౌండ్‌లో పోటాపోటీ..
సచిన్ ఇండియా తరఫున, మురళీధరన్ శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. తమ జట్లకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డులు నెలకొల్పారు. సచిన్ వికెట్ తీయాలని మురళీ.. మురళీ బౌలింగ్‌లో బౌండరీలు కొట్టాలని సచిన్.. గ్రౌండ్‌లో పోటాపోటీకి ఆడేవారు. బయట మాత్రం సన్నిహితంగా ఉండేవారు. ఆ కారణంతోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయడానికి సచిన్ అంగీకరించారు.
Also Read: మీ ఫ్రెండ్‌షిప్ బౌండరీ రోప్ బయట చూపించుకోండి.. గంభీర్ చురకలు!
అక్టోబర్‌లో సినిమా విడుదలకు ప్లాన్..
ఇక ఈ చిత్రంలోని మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మది మలర్ పాత్రలో మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత షెహన్.. కరుణతిలకతో కలిసి మూవీకి స్క్రిప్ట్ అందించారు. ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రం విడుదల కానుంది. అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘800’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ వస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని కృష్ణప్రసాద్ తెలిపారు. సచిన్‌తో పాటు ప్రముఖ క్రికెటర్లు, సినీ ప్రముఖులు సైతం ఈ వేడుకలో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా గతంలో మురళీథరన్ పాత్రలో నటించేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి అంగీకరించారు. ఆయనపై కొన్ని సన్నివేశాలు సైతం అంగీకరించారు. అయితే కొన్ని తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ మూవీ నుంచి విజయ్ తప్పుకున్నారు.
Also Read: గుడ్‌న్యూస్ చెప్పిన బుమ్రా.. తండ్రైన యార్కర్ కింగ్..పిల్లాడి పేరు తెలుసా?