Sachin: ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది..సచిన్ ఎమోషనల్ పోస్ట్..!

ముంబయి వాంఖెడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చిన్ననాటి ఫొటోను పంచుకుని వాంఖెడేతో తన అనుబంధాన్ని వివరించారు.

New Update
Sachin: ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది..సచిన్ ఎమోషనల్ పోస్ట్..!

Sachin Tendulkar Statue Wankhede:  ముంబయి వాంఖెడే స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే బుధవారం ఆవిష్కరించారు. దీనిపై సచిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

తన చిన్ననాటి ఫొటోను పంచుకుని వాంఖెడేతో తన అనుబంధాన్ని వివరించారు. "ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. నేను 10 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పటి ఫొటో ఇది. నాడు 25 మంది ఉంటే చేతిలో ఉన్నది 24 టికెట్లే. ఆ బృందంలో ఒకడిగా వాంఖెడే స్టేడియం నార్త్ స్టాండ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇవాళ అదే స్టేడియంలో నా విగ్రహం ఆవిష్కరించే వరకు నా క్రికెట్ జీవితం ఎన్నో మలుపులు తిరిగి.. తిరిగి ఇక్కడికే వచ్చింది. ఆ రోజు మేం మ్యాచ్ చూడ్డానికి వచ్చినప్పుడు మా బృందం చేసిన హంగామా, ఆ ఆనందం ఇప్పటికీ నాకు గుర్తుంది.

publive-image

నా క్రికెట్ కెరీర్ ఆసాంతం నార్త్ స్టాండ్ గ్యాంగ్ అందించిన మద్దతు ఎనలేనిది. ఒక్కసారి ఆలోచిస్తే.. మొదట ఓ క్రికెట్ అభిమానిగా వాంఖెడేలో అడుగుపెట్టాను. ఆ తర్వాత 1987 వరల్డ్ కప్ లో బాల్ బాయ్ గా సేవలందించాను. 2011లో ఇదే మైదానంలో వరల్డ్ కప్ విజేతగా నిలిచాను. అంతెందుకు, నా కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది కూడా వాంఖెడేలోనే. ఈ ప్రస్థానాన్ని మాటల్లో వర్ణించలేను.

Sachin Tendulkar Statue Wankhede

ఇక, ఈ విగ్రహం నా ఒక్కడిదే అనుకోవడంలేదు. ఇది నా కెరీర్ లో సహకరించిన ప్రతి ఒక్క నాన్ స్ట్రయికర్ కు అంకితం, ప్రతి టీమ్ మేట్ కు అంకితం, ప్రతి సహచరుడికి అంకితం, నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకింతం. వారు లేకుండా ఇంతటి ఘనతర ప్రస్థానం సాధ్యం కాని పని. వాంఖెడే, క్రికెట్.. మీరెంత మంచివాళ్లు!" అంటూ సచిన్ తన మనోభావాలను పంచుకున్నాడు.

Sachin Tendulkar Statue Wankhede

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గురించి తెలియని వారెవరుంటారు. క్రికెట్ ప్రపంచంలో అతని ఎదిగిన ఎత్తుకు ఇంత వరకూ ఎవ్వరూ ఎదగలేదని చెప్పుకోవచ్చు. యవ్వనం రాకముందప్పటి నుంచే సచిన్ క్రికెట్ ఆడటం నేర్చుకున్నాడు. టెన్త్ ఫెయిల్ అయినా జీవితంలో పెద్ద సక్సస్ ను సాధించాడు. సచిన్ తన కెరీర్ లో క్రికెట్ రికార్డ్స్ పక్కకు పెడితే, ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో సత్కారాలను పొందాడు. 1994లో అర్జున అవార్డు, 1999లో పద్మశ్రీ పురస్కారం, 1997లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం, 2008లో పద్మవిభూషన్, 2014లో భారత రత్న, 2020లో లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును సచిన్ పొందారు.

Also Read: ఇజ్రాయెల్ పై యుద్ధం ఆపేదేలేదు..తేల్చి చెప్పిన హమాస్ అధికార ప్రతినిధి..!

#wankhede-stadium #sachin-tendulkar-statue #sachin-statue-wankhede
Advertisment
Advertisment
తాజా కథనాలు