Sabarimala: అయ్యప్ప క్షేత్రంలో వసతులు కల్పించండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తుల రద్దీకి తగిన వసతులు కల్పించాలని కేరళ సీఎం పినరయి విజయ్‌కు సూచించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇటీవలే లేఖ రాసిన ఆయన.. ఇవాళ మరోసారి కోరారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన సాయం చేస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి.

New Update
Sabarimala: అయ్యప్ప క్షేత్రంలో వసతులు కల్పించండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Sabarimala Facilities: హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆదివారం నారాయణగూడ ప్రాంతం మార్మోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా మాట్లాడిన కిషన్ రెడ్డి కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస వసతులు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఏర్పాట్ల లేమి కారణంగా తెలుగు రాష్ట్రాల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశానన్న కేంద్రమంత్రి.. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి, అన్నిరకాల చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అయితే, అంతకుముందు కావ్య కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పదునెట్టాంబడిపై స్వామి వారికి షోడశోపచారాలు నిర్వహించారు. తర్వాత అయ్యప్ప స్వాముల శరణుఘోషతోపాటు, భజనలు, పాటలతో ఆ ప్రాంతం మార్మోగింది. గురుస్వామి ఆత్రేయాచార్యుల చేతుల మీదుగా జరిగిన పూజా కార్యక్రమంలో గాయకుడు జడల రమేష్ ఆలపించిన పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. భజన బృందం, ఆర్కెస్ర్టా, దేవతా మూర్తుల వేషధారణతో కళాకారులు నృత్యాలతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

23 ఏళ్లుగా..

గత 23 ఏళ్లుగా ఘనంగా అయ్యప్ప స్వాములతో మహా పడిపూజోత్సవం నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు తెలంగాణ తెలుగు ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. అనంతరం, స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప స్వాములుకు భోజనం వడ్డించడంతోపాటు తాంబూలాన్ని అందించి వారి ఆశీస్సులు పొందారు.

ఈ పడిపూజోత్సవంలో.. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌తో పాటుగా నగరంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు కొండా విశ్వశ్వర్ రెడ్డి దంపతులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రఘునందన్ రావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వాముల మృతిపై దిగ్భ్రాంతి..

అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లి తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ వాసులు ముగ్గురు మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Also Read:

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు..

అమ్మాయిల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం.. అర్హతలివే..

Advertisment
తాజా కథనాలు