Russia vs Ukraine: రష్యాలోకి చొచ్చుకు పోతున్న ఉక్రెయిన్ సైన్యం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమవుతోంది. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి 35 కిలోమీటర్ల దూరం చొచ్చుకుపోయాయి. రష్యాలోని సుడ్జా నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. గత పదిరోజుల్లో 82 రష్యా గ్రామాలను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది 

New Update
Russia vs Ukraine: రష్యాలోకి చొచ్చుకు పోతున్న ఉక్రెయిన్ సైన్యం

Russia vs Ukraine:  రష్యాలోని సుడ్జా నగరాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి 35 కిలోమీటర్ల లోతుకు లోపలకు చొచ్చుకుపోయింది. ఉక్రేనియన్ మిలిటరీ కమాండెంట్ సెంటర్ ఇప్పుడు సుడ్జాలో ప్రారంభించినట్టు జెలెన్స్కీ గురువారం వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు. గత 10 రోజుల్లో ఉక్రెయిన్ సైన్యం 82 రష్యా గ్రామాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. సుడ్జా ఉక్రెయిన్ సరిహద్దు నుండి దాదాపు 10 కి.మీ. దూరంలో ఉంటుంది. దీని జనాభా సుమారు 5,000. ఇక్కడ రష్యన్ గ్యాస్ పైప్‌లైన్ స్టేషన్ ఉంది. దాని సహాయంతో యూరోపియన్ దేశాలకు గ్యాస్ సరఫరా చేస్తుంది.

Russia vs Ukraine:  బ్రిటిష్ వెబ్‌సైట్ ది గార్డియన్ వార్తల ప్రకారం, హంగేరి - స్లోవేకియా గ్యాస్ సరఫరా ప్రభావితమవుతుంది, ఉక్రెయిన్ సుడ్జాను స్వాధీనం చేసుకోవడం ఒక పెద్ద సంఘటన. రష్యా తన గ్యాస్‌లో దాదాపు 3% సుడ్జా మార్గం ద్వారా యూరోపియన్ దేశాలకు దిగుమతి చేసుకుంటుంది.  రష్యా మాజీ ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ ఫెడోరోవ్ స్టేట్ టెలివిజన్ టాక్ షోలో సుడ్జాపై ఉక్రెయిన్ నియంత్రణ రష్యా కంటే యూరప్‌కు ఎక్కువ హాని కలిగిస్తుందని అన్నారు. హంగరీ, స్లోవేకియాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోతుంది. అయితే ఇప్పటి వరకు గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు.

ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ ఒలెక్సాండర్ సిర్ స్కీ ప్రకారం, ఉక్రెయిన్ రష్యా నుండి 1,150 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ ఆగస్టు 6న రష్యాలోని కుర్స్క్ ప్రాంతంపై దాడి చేసింది.

Russia vs Ukraine:  న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏదైనా ఒక  దేశం రష్యా సరిహద్దులోకి చొరబడటం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు హిట్లర్ రష్యాపై దాడి చేసి ఇంత పెద్ద ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 

Russia vs Ukraine:  ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యాలో 2 లక్షల మందికి పైగా ప్రజలున్న కుర్స్క్‌లో ఆగస్టు 8న ఎమర్జెన్సీని ప్రకటించారు. దీని తరువాత, రష్యా ఆగస్టు 14 న బెల్గోరోడ్‌లో అత్యవసర పరిస్థితిని విధించింది. అయినప్పటికీ, కుర్స్క్‌లో చేసినట్టుగా బెల్గోరోడ్‌లో యుద్ధాన్ని రష్యా అంగీకరించలేదు.

రష్యన్ వార్తా సంస్థ TASS ప్రకారం, బెల్గోరోడ్‌లోని కొన్ని ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యరుగ జిల్లా నుంచి 11,000 మందిని తరలించారు. కుర్స్క్ పక్కనే ఉన్న గుల్షకోవో జిల్లా కూడా ఖాళీ చేశారు. BBC రిపోర్ట్ ప్రకారం, ఉక్రెయిన్ ఆకస్మిక దాడి తరువాత, 2 లక్షల మందికి పైగా రష్యన్ పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు