Rupee vs Dollar: గ్రీన్‌బ్యాక్‌లో విస్తృత ర్యాలీ, US ట్రెజరీలలో పెరుగుదల కారణంగా భారత రూపాయి మంగళవారం రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.51 వద్ద ప్రారంభమైంది, ఇది క్రితం సెషన్లలో 83.45 వద్ద ఉంది. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తత, ఫెడ్ ఔట్ లుక్ కారణంగా, రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంఘర్షణల కారణంగా ఆసియా దేశాల కరెన్సీలు ఒత్తిడికి గురవుతున్నాయి.
Rupee vs Dollar: US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తర్వాత తగ్గించవచ్చనే వార్తలు, రిటైల్ అమ్మకాలలో ఊహించిన దాని కంటే ఎక్కువ పెరుగుదల కారణంగా US బలమైన స్థితిలో ఉంది. రూపాయి ఏప్రిల్ 16 న ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. US డాలర్‌తో పోలిస్తే 6 పైసలు పడిపోయింది. డాలర్‌కు రూ. 83.51 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు మార్చి 22, 2024న డాలర్‌తో రూపాయి కనిష్ట స్థాయి 83.45కి చేరుకుంది.
Also Read: మైక్రోసాఫ్ట్ విండోస్..ఆఫీస్ వాడుతున్నారా? ప్రమాదం పొంచి ఉంది.. జాగ్రత్త!
రూపాయి పతనం ఈ విషయాలపై ప్రభావం చూపుతుంది
Rupee vs Dollar: రూపాయి పతనం కారణంగా భారతదేశ దిగుమతి వ్యవస్థ ప్రభావితమవుతుంది. దీనివల్ల విదేశాలకు వెళ్లడం, చదువుకోవడం కూడా ఖరీదు అవుతుంది. ఉదాహరణకు, డాలర్‌తో రూపాయి విలువ 50 ఉన్నప్పుడు, అమెరికాలో భారతీయ విద్యార్థులు 50 రూపాయలకు 1 డాలర్‌ను పొందగలరు. ఇప్పుడు 1 డాలర్ కోసం విద్యార్థులు 83.51 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ముడి చమురు ధరలపైనా ప్రభావం పడింది
Rupee vs Dollar: ముడిచమురు ధరల పెరుగుదల కూడా రూపాయిపై ఒత్తిడి తెచ్చింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 0.59% పెరిగి $90.63కి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.62% పెరిగి $85.94కి చేరుకుంది.