TS: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా.. పొన్నం ప్రభాకర్ తో Rtv సెన్సేషనల్ ఇంటర్వ్యూ!

తెలంగాణలో సాగు, తాగు నీరు.. కరెంట్ కష్టాలు. వడ్లకు బోనస్. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు. నెక్ట్స్ సీఎం కోమటిరెడ్డి. ఆరు గ్యారెంటీల అమలు. ఎమ్మెల్యేల జంపింగ్. కాంగ్రెస్ కూలిపోబోతుంది నిజమేనా? వంటి సంచలన విషయాలపై Rtvతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫేస్ టూ ఫేస్.

New Update
TS: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా.. పొన్నం ప్రభాకర్ తో Rtv సెన్సేషనల్ ఇంటర్వ్యూ!

Ponnam prabhakar: తెలంగాణలో సాగు, తాగు నీరు.. కరెంట్ కష్టాలు. వడ్లకు బోనస్. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు. నెక్ట్స్ సీఎం కోమటిరెడ్డి. ఆరు గ్యారెంటీల అమలు. ఎమ్మెల్యేల జంపింగ్. కాంగ్రెస్ కూలిపోబోతుంది నిజమేనా? వంటి సంచలన విషయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో Rtvతో ఫేస్ టూ ఫేస్.

కరువుకు ఏ ప్రభుత్వం కారణం కాదు..
ఈ మేరకు కరువు తీసుకొచ్చి కన్నీళ్లు మిగిల్చారా అనే మాటకు ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నం.. ప్రభుత్వం వర్షాకాలంలో రాలేదని, దానికి బీఆర్ఎస్ కారణం అని కూడా చెప్పలేమన్నారు. ప్రకృతి వల్ల కరువు వచ్చిందే తప్పా దానికి కారణం కాంగ్రెస్ కాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చిత్త శుద్ది వుంటే దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. తాగునీటి, సాగునీటిని సక్రమంగా చూసుకోవాలని అధికారులకు ఇప్పటికే సూచించినట్లు తెలిపారు. దీనికి రాజకీయంతో సంబంధం లేదన్నారు. అలాగే భూగర్భ జలాలు పడిపోయాయని, అందుకే సాగే నిటికి ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు.

కరెంట్ కష్టాలు ఎక్కడా లేవు..
ఇక రాష్ట్రంలో కరెంట్ కష్టాలపై మాట్లాడుతూ.. ఎక్కడ కంప్లైట్ లేవని, అవన్నీ తప్పుడు ఆరోపణలే అన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులను తాము తీర్చుతూ.. రైతులకు కరెంట్ అందిస్తున్నామన్నారు. కలెక్టర్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వడ్లపై బోనస్ వర్షాకాల పంటకు అందిస్తామన్నారు. ఈ సీజన్ ఇవ్వలేకపోవడంపై ప్రశ్నలను దాటవేశారు. బండి సంజయ్ తో వైరంపై మాట్లాడుతూ.. ఎంపీగా ఆయన చేసిన పనులను చూపించాలన్నారు. గుడ్డిగా ఆరోపణలు చేయొద్దన్నారు.

ప్రజల పట్ల విశ్వాసం ఉంది..
అలాగే 6 గ్యారంటీలు నెరవేరుస్తారా లేదా అనే ప్రశ్నలకు.. బీఆర్ఎస్ 7 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. లక్ష యాభై వేల కోట్ల అప్పులు తీర్చుకుంటూ తాము ప్రజల హామీలు నెరవేరుస్తామన్నారు. మహిళల ఫ్రీ బస్సు పెట్టి ఆర్టీసీకీ మంత్లీ పేమెంట్ చేస్తున్నామన్నారు. మహిళలకు 2500 ఇస్తున్నారా? ఇండ్లు ఇచ్చారా? విద్యార్థుల హామీలు నెరవేరుస్తారా? అనే వ్యాఖ్యలపై.. తమకు ప్రజల పట్ల విశ్వాసం ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చీ.. మరోసారి తమ ప్రభుత్వాన్ని గెలిపించేలా ప్రజలకు మద్ధతుగా ఉంటామన్నారు. ఇక ఎంపీ ఎన్నికలు ముగియగానే రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. సిలిండర్ తోపాటు ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజాపాలనతో తీసుకున్న ధరఖాస్తుల్లో ఇప్పటికే 1 కోటి ధరఖాస్తులకు సంబంధించి ప్రణాళిక మొదలు పెట్టినట్లు మంత్రి పొన్నం చెప్పారు.

Advertisment
తాజా కథనాలు