వరద ఉధృతిలో Rtv బృందం సాహసం..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పరిధిలోని గొల్లప్రోలు గ్రామంలో Rtv టీమ్‌ సాహసం చేసింది. భారీగా వస్తున్న వరదను సైతం లెక్క చేయకుండా నది ప్రవాహంలోకి దిగి రైతుల, గ్రామస్తుల కష్టాలను తెలుసుకుంది. తమకు ప్రభుత్వం సహకారం అందించాలని రైతులు Rtv ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వరద ఉధృతిలో Rtv బృందం సాహసం..
New Update

Rtv team's adventure in flood

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని కొస్తాంధ్రలో విస్తారంగా వర్షం కురుస్తోంది. కాకినాడ (Kakinada) జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో పలు ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. అయితే వరద నీటిలో Rtv టీమ్‌ సాహసం చేసింది. వర్షపు నీటిలోకి వెళ్లిన Rtv రిపోర్టర్‌ చాతి వరకు నీళ్లు వచ్చాయి. జిల్లాలోని గొల్లప్రోలు(Gollaprolu) సమీపంలో నిర్మించిన జగనన్న ఇళ్ల వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.

మరోవైపు శుద్ధగడ్డ వాగు (Shuddhagadda river) ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గొల్లప్రోలు నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని దీంతో తమ గ్రామంలోని పలు కాలనీల్లోకి వదర నీరు వచ్చి చేరిందని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నట్లు గొల్లప్రోలు (Gollaprolu)గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇతర గ్రామాలకు వెళ్లాలంటే కాలువే దిక్కని, అత్యవసర పరిస్థితి (emergency situation) ఉంటే తాము కాలువ దాటాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ గ్రామాల్లోకి నీరు వస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తిసుకోవడం లేదని గొల్లప్రోలు గ్రామస్తులు వాపోయారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించే వారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శుద్ధగడ్డ వాగు (Shuddhagadda river) ఉధృతంగా ప్రవహిస్తోందని, వర్షాలు ఇలాగే కొనసాగితే వాగు ఉధృతి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని, ప్రజా ప్రతినిధులు తమను ఇప్పటికైనా ఆదుకోవాలని వాపోయారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకునేందుకు తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వారు తెలిపారు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు (political leaders) ఇప్పడు తాము ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మాత్రం తమను పట్టించుకోవడంలేదన్నారు.

మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం (Visakha Weather Station) తెలిపింది. మరోవైపు ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మత్య్సకారులు వెటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

#kakinada #varada-udhruthi #rtv-team #saasaham #gollaprolu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe