/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-Elections-post-poll-study-.jpg)
విజయనగరం పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ గెలుస్తారని ఆర్టీవీ ప్రీపోల్ స్టడీలో స్పష్టమైంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడ టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకి ఆధిక్యత కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పూర్తి స్థాయిలో అప్పలనాయుడుకు మద్దతు ఇవ్వడం ఆయనకు బాగా కలిసొచ్చింది. పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల నేతలతో అప్పలనాయుడు టచ్‌లో ఉంటూ దూసుకుపోయారు. వైసీపీపై వ్యక్తమైన వ్యతిరేకత, టీడీపీకి ఉన్న వేవ్ సైతం విజయనగరం పార్లమెంట్ పరిధిలో ప్రభావం చూపించిందని ఆర్టీవీ స్టడీలో తేలింది. కాబట్టి అక్కడ టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఎంపీగా గెలవబోతున్నారని స్పష్టమవుతోంది.