RTV Post Poll Study: తిరుపతిలో పరిస్థితి తారుమారు.. గెలిచేది ఎవరో చెప్పిన రవిప్రకాష్ తిరుపతి ఎంపీ సీటులో ఆర్టీవీ నిర్వహించిన ప్రీపోల్ స్టడీలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గెలిచే అవకాశం ఉందని స్పష్టమైంది. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కు అనుకూలంగా మారిందన్నారు రవిప్రకాష్. ఆయన పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి. By Nikhil 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి ఇప్పుడు తిరుపతి పార్లమెంట్‌లో మారిన పరిణామాలను చూద్దాం. ప్రీపోల్ సర్వేలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గెలిచే అవకాశం కనిపించింది. కానీ పోస్ట్ పోల్ సమయానికి ట్రెండ్ మారింది. కూటమికి ఉన్న వేవ్ తిరుపతి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌కి కలిసి వస్తోంది. తిరుపతి జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ సీట్లలో టీడీపీకి ఉన్న సానుకూలత ఎంపీ సీటుపైనా ప్రభావం చూపిస్తోంది. అదే వరప్రసాద్‌కు కలిసి వచ్చింది. సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపకపోవడం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఆయన కన్నా కూటమి అభ్యర్థిని గెలిపిస్తే బాగుంటుందనే అభిప్రాయం జనంలో స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామాలతో పోస్ట్ పోల్ స్టడీలో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి