AP Game Changer: పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా.. ఈస్ట్ లో ఎక్కువ సీట్లు ఆ పార్టీకే?

ఈస్ట్ గోదావరి.. రాష్ట్రంలోనే అత్యధికంగా 19 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న జిల్లా ఇది. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 14, టీడీపీ 4, జనసేన ఒక సీటు గెలుచుకున్నాయి. అయితే ఈ సారి ఇక్కడ ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

AP Game Changer: పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా.. ఈస్ట్ లో ఎక్కువ సీట్లు ఆ పార్టీకే?
New Update

ఈ సారి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ 5, టీడీపీకి 10, జనసేన 3, బీజేపీ 1 సీటులో విజయం సాధించే అవకాశం ఉందని RTV స్టడీ స్పష్టం చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, నియోజకవర్గాల వారీగా లెక్కలు ఇలా ఉన్నాయి.

తుని..
ఇక్కడ కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ ఉండటం వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాకి ప్లస్ పాయింట్. వరుసగా రెండు సార్లు గెలిచి ఉండడం అడ్వాంటేజ్ అవుతుంది. యనమల కృష్ణుడు వైసీపీలో చేరడం కూడా దాడిశెట్టికి కలిసొస్తుంది. టీడీపీ అభ్యర్థి యనమల దివ్య తొలిసారి పోటీ చేస్తుండటం కూడా దాడిశెట్టికి అడ్వాంటేజ్. మొత్తంగా దాడిశెట్టి రాజా గెలిచే అవకాశం ఉందని RTV స్టడీ చెబుతోంది.
publive-image

పిఠాపురం..
ప్రస్తుత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్న మరో నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. 2019లో ఆయన రెండు చోట్ల ఓడిపోయారన్న సానుభూతి ఉంది. ఇక సినీ గ్లామర్ ఆయనకు ప్రధానంగా కలిసొచ్చే అంశం. పిఠాపురం మెగా అభిమానులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడం మరో అడ్వాంటేజ్. మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం పవన్‌కు మరో ప్లస్ పాయింట్. ఈసారి ఇక్కడ పవన్ గెలుపు ఖాయమని RTV స్టడీలో తేలింది.
publive-image

అనపర్తి..
ఈస్ట్‌లో మరో కీలక సెగ్మెంట్ అనపర్తి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మొదట టీడీపీ టికెట్ రాకపోవడంతో సానుభూతి పెరిగింది. ఆఖరి నిమిషంలో పట్టుబట్టి బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నా స్థానికంగా మంచి సంబంధాలు ఉన్నాయి. కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా మరో అడ్వాంటేజ్. వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ ప్రజలతో పెద్దగా కలవరన్న టాక్ కూడా నల్లమిల్లికి ప్లస్ పాయింట్. ఇక్కడ నల్లమిల్లిదే విజయమని ఆర్టీవీ స్టడీలో తేలింది.
publive-image

ఇతర నియోజకవర్గాల వివరాలు..
ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ, కాకినాడ రూరల్-జనసేన అభ్యర్థి పంతం నానాజీ, పెద్దాపురం-టీడీపీ అభ్యర్థి నిమ్మకాయ చినరాజప్ప, కాకినాడ సిటీ-టీడీపీ అభ్యర్థి కొండబాబు, రామచంద్రాపురం-టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, ముమ్ముడి వరం-టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు..
publive-image

అమలాపురం-టీడీపీ అభ్యర్థి-ఆనందరావు, రాజోలు-వైసీపీ అభ్యర్థి-గొల్లపల్లి సూర్యారావు, పీ.గన్నవరం-జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, కొత్తపేట-వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి, మండపేట-టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వర్రావు, రాజానగరం-వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా..

publive-image

రాజమండ్రి సిటీ-టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి-టీడీపీ అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, జగ్గంపేట-టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, రంపచోడవరం-వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
publive-image

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe