RTV పోస్ట్ పోల్ సర్వే.. జగన్ ను దెబ్బ కొట్టే 5 అంశాలివే! జగన్ ఓటమి ఖాయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆ సంస్థలు చెబుతున్నట్లుగా వైసీపీ ఓటమి పాలైతే ఇందుకు ఓ ఐదు ముఖ్యమైన కారణాలు ఉన్నట్లు ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి. By Nikhil 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి మెజార్టీ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ లో ఏపీలో కూటమి గెలుపు ఖాయమని తేలింది. ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్లు ఏపీలో జగన్ ఓటమి పాలైతే.. ఈ కింది 5 అంశాల ప్రభావమేనన్న చర్చ జోరుగా సాగుతోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: పైగా జగన్‌పై నాలుగు అంశాల్లో జనంలో స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెలుపోటములను మార్చేసింది. తమ భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్లిపోతాయన్న భయం జనంలో ఉంది. పాస్‌బుక్‌లపై జగన్ ఫొటోలు వేసుకోవడంతో జనంలో అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఇది జగన్‌పై వ్యతిరేకతకు దారితీసింది. లిక్కర్: మద్యం అమ్మకాలు వైసీపీ ప్రభుత్వానికి అతిపెద్ద మైనస్‌గా కనిపిస్తున్నాయి. చీప్ బ్రాండ్లు, అత్యధిక రేట్లు చాలా నెగెటివ్ ఇంపాక్ట్‌ను చూపించాయి. కుటుంబ పెద్ద సంపాదన అంతా మద్యానికే సరిపోతోందన్న ఆందోళన మహిళల్లోనూ స్పష్టంగా ఉంది. రోడ్లు: రోడ్లు దారుణంగా ఉండటం బలమైన నెగెటివ్ ఇంపాక్ట్‌కు కారణమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో రోజూ పెద్ద పెద్ద గుంతల రోడ్లతో ఈ ఐదేళ్లు నరకం చూశామన్న ఆవేదన మెజార్టీ జనంలో ఉంది. అదే వైసీపీకి అతిపెద్ద మైనస్‌గా మారింది. ఇళ్ల స్థలాలు: ఇళ్లు, ఇళ్ల స్థలాల అంశం పాజిటివ్ అవుతుందని వైసీపీ భావిస్తున్నా గ్రౌండ్‌లో అందుకు భిన్నమైన ట్రెండ్ ఉంది. 60 గజాల స్థలాలే ఇవ్వడం, అదీ ఊరుకి దూరంగా, మునిగిపోయే చోట ఇచ్చారనే తీవ్ర అసంతృప్తి మహిళల్లో చాలా చోట్ల కనిపించింది. ఈ అంశాలన్నీ జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో నెగెటివ్‌ను క్రియేట్ చేశాయి. మహిళల ఓట్లు: మహిళా ఓటు గురించిన చర్చ ఏపీ రాజకీయ పక్షాల మధ్య తీవ్రంగా జరుగుతోంది. మహిళలు విపరీతంగా ఓటు వేశారని, వారు అధికార పక్షం వైపు ఓట్లు కురిపించారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంలో వాస్తవాలు ఓ సారి చూద్దాం. ఏపీలో 24 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 2019 ఓటింగ్ తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ఇదే వాదన వినిపించారు. కానీ ఫలితం మరో రకంగా కనిపించింది. అధికార వైసీపీ మద్యం పాలసీ మహిళల్ని బాగా ఆందోళనకు గురిచేస్తుందన్నది వాస్తవం. ఇదే వ్యతిరేకత మహిళా ఓటర్లలో వ్యక్తమయిందని RTV స్టడీలో తేలింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి