శ్రీనివాస సేతు వంతెన నిర్మాణంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్

ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరానికి ప్రపంచం నలమూలాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి? ఆఫ్కాన్ సంస్థకే మళ్లీ నిర్మాణ బాధ్యతలు ఎందుకిచ్చారు? శ్రీనివాస సేతు వంతెన నిర్మాణంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్.

శ్రీనివాస సేతు వంతెన నిర్మాణంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్
New Update

రూ.684కోట్లతో వంతెన నిర్మాణం..

తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు 2019 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 6.4 కిలోమీటర్ల మేర ఉండే ఈ వంతెనను రూ.684కోట్లతో ఆఫ్కాన్ సంస్థకు అప్పగించారు. ఇందులో టీటీడీ వాటా 458.28 కోట్లు(67శాతం), తిరుపతి స్మార్ట్ సిటీ వాటా అంటే 225.72కోట్లు(33శాతం)గా నిర్ణయించారు. తిరుచానూరు, రేణిగుంట, కరకంబాడి వైపు వచ్చే వాహనాలను నేరుగా కపిల తీర్థం వద్దకు వెళ్లే విధంగా ఫ్లై ఓవర్ నిర్మాణం డిజైన్ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్‌కు ప్రయత్నాలు చేసింది. కానీ కమీషన్ల కోసమే పనులు ఆపారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మళ్లీ ఆఫ్కాన్ సంస్థకే బాధ్యతలు అప్పగించారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ పార్క్ వరకు వివిధ మార్గాలను కలుపుతూ నిర్మాణం చేపట్టారు.

ప్రమాదవశాత్తూ ఇద్దరు కార్మికులు మృతి..

అయితే అటు టీటీడీ.. ఇటు స్మార్ట్ సిటీ నిధులు విడుదల చేయడంలో జాప్యం జరగడంతో కొన్ని నెలలు పాటు పనులు నిలిచిపోయాయి. అనంతరం పనులు వేగం పుంజుకున్నాయి. ఇటీవల నాలుగో దశ పనులు ఆఖరి దశకు చేరుకోవడంతో కొన్ని ప్రధానమైన మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షలు కారణంగా తిరుపతి ప్రజలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆఫ్కాన్ సంస్థపై అధికారులు ఒత్తిళ్లు తీసుకురావడంతో నిరంతరాయంగా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందడం కలకం రేపింది. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినప్పటి నుండి వరుస అపశృతులు చోటుచేసుకోవడంతో ఆఫ్కాన్ సంస్థ శాంతి యాగాన్ని కూడా నిర్వహించింది. ఆగస్టులో పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ పనులు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. త్వరతగతిన పనులు పూర్తి అయితే ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే అని అధికారులు భరోసా ఇస్తున్నారు.

వరుస అపశృతులతో భక్తుల భయాందోళన..

శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ప్రారంభమైన దగ్గరి నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద పనులు జరుగుతుండగా గడ్డర్ అమర్చే సమయంలో విషాదం జరిగింది. సిమెంట్ దిమ్మె ఒక్కసారిగా కింద పడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు వెస్ట్ బెంగాల్‌కు చెందిన అభిజిత్, మరొకరు బిహార్‌కు చెందిన బార్థోమండల్‌గా పోలీసులు నిర్ధారించారు. గతంలో కూడా ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కార్మికుడు మృతి చెందాడు. అంతకు ముందు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కొర్లకుంట జంక్షన్‌లో కుప్ప కూలింది. వరుస ఘటనల నేపథ్యంలో స్థానికులను, భక్తులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe