/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Ananthapur-MP.jpg)
అనంతపురం ఎంపీ సెగ్మెంట్ లో పోలింగ్‌కి కొద్ది రోజుల ముందు వరకు టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకే పరిస్థితి అనుకూలంగా ఉంది. కానీ ఎన్నికల సమయానికి ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి, మంత్రి శంకర్ నారాయణకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ క్యాండిడేట్ ఎలక్షనీరింగ్‌లో వెనుకబటం అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పైగా ఆయన అనంతపురం నియోజకవర్గానికి కొత్త. గ్రౌండ్ లెవల్లో సమన్వయం చేసుకోవడంలో లక్ష్మీనారాయణ వెనుకబడినట్లు మా సర్వేలో తేలింది. శంకర నారాయణకు ఆయన సామాజికవర్గమైన కురబ ఓట్లు సాలిడ్‌గా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రభావంతో అనంతపురం ఎంపీ సీటులో వైసీపీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.