RTV ఎఫెక్ట్.. RBI కోర్టులో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫ్రాడ్!

ఆర్టీవీ కథనంతో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కార్యకలాపాలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే తెలంగాణ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఈ బ్యాంక్ ఇచ్చే ఫేక్ గ్యారెంటీలపై ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా కార్తీ చిదంబరం ఈ బ్యాంక్ సంగతేంటో చెప్పాలంటూ RBIకి లేఖ రాశారు.

New Update
RTV ఎఫెక్ట్.. RBI కోర్టులో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫ్రాడ్!

Euro Exim Bank: ఆర్టీవీ కథనంతో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కార్యకలాపాలపై రాజకీయనేతలు గళం విప్పుతున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు కార్తీ చిదంబరం (Karti Chidambaram) ఆర్బీఐకి లేఖ రాశారు. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంస్థకు మన దేశంలో బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేందుకు అనుమతి ఉందా? అన్న విషయంపై క్లారిటీ ఇవ్వాలన్నారు. Euro Exim Bank Ltd సెయింట్ లూసియాలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీచే నియంత్రించ బడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇంగ్లాండ్ వేల్స్ చట్టాల కింద ఏర్పాటైన ఈ బ్యాంక్ పై మనదేశంలో ఎలాంటి నియంత్రణలు ఉన్నాయో తెలపాలని లేఖలో కోరారు కార్తీ చిదంబరం. అసలు Euro Exim బ్యాంక్ RBIచే నియంత్రించబడుతుందా? లేదా? చెప్పాలన్నారు.
ఇది కూడా చదవండి: MEGHA Scam: వేల కోట్ల దొంగ బ్యాంక్ గ్యారంటీలు.. లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రహణం!

ఇంకా ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, ఇతర వర్తించే నిబంధనలకు కట్టబడి పని చేస్తుందా? దీనిపై ఆర్బీఐ పర్యవేక్షణ ఎంత వరకు ఉంది? అన్న అంశంపై సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు కార్తీ చిదంబరం. ఆర్టీవీ బయటపెట్టిన యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీల బాగోతం అంశాన్ని సైతం కార్తీ చిదంబరం తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. భారతదేశంలో బ్యాంక్ గ్యారెంటీలను జారీ చేయడానికి యూరో ఎగ్జిమ్ బ్యాంక్‌కు అనుమతి ఉందా? అన్న అంశాన్ని స్పష్టం చేయాలని ఆర్బీఐని కోరారు.

ఒక వేళ అనుమతి ఉంటే.. అలాంటి గ్యారెంటీలు ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ పరిధిలోకి వస్తాయా? రావా? అన్నది కూడా స్పష్టం చేయాలని లేఖలో పేర్కొన్నారు. భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులకు, RBI క్రింద నమోదు కాని విదేశీ సంస్థలచే జారీ చేయబడిన బ్యాంక్ గ్యారెంటీలను ఆమోదించడానికి అనుమతి ఉందా? అన్న వివరాలు తెలపాలన్నారు.
Following my letter to ⁦@TheOfficialSBI⁩ I have now written to ⁦@RBI⁩ seeking information about the regulatory compliance of ⁦@euro_eximbankpic.twitter.com/GwNWDNvScs

దీంతో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ జారీ చేసే బ్యాంక్ గ్యారెంటీలపై RBI ఎలా స్పందిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కార్తీ చిదంబరం రాసిన లేఖకు ఆర్బీఐ ఇచ్చే రిప్లైతో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నిర్వహించే కార్యకాలపాలు, గ్యారెంటీలకు సంబంధించి అనేక కీలక ఆంశాలు బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే.. యూరో ఎగ్జిమ్‌ బ్యాంకు గ్యారెంటీలను ఎలా అంగీకరించారో చెప్పాలంటూ ఇప్పటికే SBIకి కార్తీ చిదంబరం లేఖ రాశారు.

ఇది కూడా చదవండి: Fake Bank Guarantees Scam: మిథున్ రెడ్డి, పొంగులేటితో పాటు.. ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన ప్రముఖులు వీరే!

Advertisment
తాజా కథనాలు