RTC Narasimha: ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహా ఇక లేరు!

ఆర్టీసీ కురవృద్ధుడిగా పేరు తెచ్చుకున్న 98 ఏళ్ల నరసింహా ఇక లేరు. ఓల్డ్ అల్వాల్ లోని తన నివాసంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో ఎంప్లాయ్ గా చేరిన ఆయన ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించి ఆర్టీసీ కురవృద్ధుడిగా పేరుగాంచారు...

New Update
RTC Narasimha: ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహా ఇక లేరు!

RTC Narasimha: ఆర్టీసీ కురవృద్ధుడిగా పేరు తెచ్చుకున్న 98 ఏళ్ల నరసింహా ఇక లేరు. ఓల్డ్ అల్వాల్ లోని తన నివాసంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో ఎంప్లాయ్ గా చేరిన ఆయన ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించి ఆర్టీసీ కురవృద్ధుడిగా పేరుగాంచారు.

ఇక లాస్ట్ ఇయర్ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆయన్ని టీఎస్ ఆర్టీసీ ఘనంగా సన్మానించింది. ఆగష్టు పదిహేనున ఆయన్ని బస్ భవన్ లో ముఖ్య అతిథిగా పిలివడం జరిగింది. అదే విధంగా వజ్రోత్సవాల సమయంలో ఆర్టీసీ ట్యాంక్ బండ్ పై చేపట్టిన ర్యాలీని కూడా నరసింహానే ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపారు. ఇక 1925 లో పుట్టిన ఆయన 1944 లో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్లో గుమస్తాగా ఉద్యోగంలో చేరారు.

తరువాత 1983 లో ఆర్టీసీలో ఎకౌంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. ఇక ఉద్యోగంలో చేరినప్పుడు నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కాలో ఆయన జీతం 47 రూపాయలు. రిటైర్ అయ్యే సమయానికి ఆయన సాలరీ వెయ్యి 740 రూపాయలు. అయితే 98 ఏళ్ల ఆర్టీసీ కురవృద్దుడు టీఎల్ నరసింహా మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నానని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు