RS Praveen Kumar: మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోవడం ఖాయం

త్వరలోనే బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనని స్పష్టం చేశారు. 99 శాతం పేదలకు అధికారం దక్కాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.

New Update
RS Praveen Kumar: మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోవడం ఖాయం

బీసీలకు 60 నుంచి 70 సీట్లు కేటాయింపు..

త్వరలోనే బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనని స్పష్టం చేశారు. 99 శాతం పేదలకు అధికారం దక్కాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు 60 నుంచి 70 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. మంత్రి జగదీశ్ రెడ్డి చీకటి దందాను అడ్డుకున్నందుకే ఉమ్మడి నల్లగొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్, బీసీ నేత అయిన జానయ్య యాదవ్‌పై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. బీసీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయమైనందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలపై విచారణ చేయాలి..

కేసీఆర్  పాలనలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు తక్షణమే సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ వ్యవస్థను కేవలం తన స్వార్థం కోసం కేసీఆర్ వాడుకుంటున్నారని ఆర్‌ఎస్పీ ఆరోపించారు. 30వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతగా తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్రమంగా కట్టబెడుతున్నారన్నారు. బీఅర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనేది కేవలం బీజేపీ నినాదంగా మిగులిపోతుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశానికి జమిలి ఎన్నికలు ప్రయోజనకరం కాదన్నారు. జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోల్పోతాయని తెలిపారు.

దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తారు..

ఇటీవల జరిగిన ఛలో సూర్యాపేట కార్యక్రమం ప్రకటన సందర్భంగా 50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న అగ్రవర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తూనే ఉంటారని ఆయన ప్రశ్నించారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు, దావత్‌లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటామా ? ఆలోచించండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, చిట్యాల ఐలమ్మ, పండుగ సాయన్న, మారోజు వీరన్న, సర్వాయి పాపన్న లాంటి వీర యోధులు మన వర్గాల్లోనే జన్మించి దొరలపై పోరాటాలు చేసిన విషయం మర్చిపోయారా? అని ఆర్‌ఎస్పీ చైతన్యపరిచారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు