ఇదేం సమాధానం.. ప్రభుత్వంపై ఆర్ఎస్ ఫైర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఖర్చులకు సంబంధించి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్టీఐని ఆశ్రయించారు. సీఎం జీతం, ప్రగతి భవన్ ఖర్చు, కేసీఆర్ టూర్ల సమయంలో సిబ్బంది ఖర్చు.. ఇలా 10 అంశాలకు సంబంధించిన వివరాలు అడిగారు. అయితే.. కేసీఆర్ కు నెలకు రూ.3,36,000 ఖర్చు అవుతోందని సింగిల్ లైన్ తో రిప్లై రావడంపై ఆయన మండిపడ్డారు. By Trinath 27 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేయడంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ది సపరేట్ ట్రాక్. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సర్కార్ ఏం చేసిందంటూ తరచూ ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు. ఏదో ఒక అంశంలో కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈక్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు మరియు అధికారిక వ్యవహారాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం, 2005 కింద కొంత సమాచారాన్ని కోరారు. ఆర్ఎస్ ఆర్టీఐ ద్వారా వేసిన ప్రశ్నలు 1. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత జీతం తీసుకుంటున్నారు? నెలలో ఏ రోజు జీతం పొందుతున్నారు? 2. దయచేసి సీఎం జీతం స్లిప్ కాపీని షేర్ చేయండి. 3. ప్రగతి భవన్ నిర్వహణకు ప్రతినెలా ఎంత డబ్బు ఖర్చు చేస్తారు? 4. సీఎం భద్రతకు, ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫాంహౌస్ కు వెళ్లేందుకు ఎంత డబ్బు ఖర్చు చేస్తారు? 5. సీఎం ప్రతిరోజూ ఎన్ని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు? 6. చీఫ్ సెక్రటరీ కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్ని ఫైళ్లను పంపింది మరియు జూలై 2014 నుండి మార్చి 2023 వరకు ఏయే విషయాలపై పంపబడ్డాయి. 7. 2014 నుండి మార్చి 2023 వరకు ఆమోదించబడిన, తిరస్కరించబడిన, వాయిదా వేయబడిన ఎన్ని ఫైళ్లను సీఎంఓ నుండి చీఫ్ సెక్రటరీ స్వీకరించారు? 8. 2014 నుండి మార్చి 2023 వరకు సీఎం ఎన్ని శాఖలను సమీక్షించారు. అవును అయితే అటువంటి సమీక్షల్లో తీసుకున్న సమీక్షల వివరాలు మరియు విధానపరమైన నిర్ణయాల తేదీలు ఏమిటి? 9. గత 9 ఏళ్లలో విద్య, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం ఎన్నిసార్లు సమీక్ష నిర్వహించారు? అవును అయితే, దయచేసి సమావేశం తేదీలు, వాటిలో తీసుకున్న నిర్ణయాలను అందించండి. 10. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలు, బాధ్యతలు, అధికారిక వ్యవహారాలపై సమాచారాన్ని అందించండి. ఈ 10 ప్రశ్నలను ఆర్టీఐ ద్వారా ప్రభుత్వానికి సంధించారు ఆర్ఎస్పీ. అయితే.. రిప్లై చూసి తాను షాకయ్యానని.. ప్రభుత్వం నుండి వచ్చిన డొంకతిరుగుడు సమాధానం చూస్తే ఎవరైనా విస్తుపోతారని మండిపడ్డారు. నిజం చెప్పడానికి ఎందుకు జంకుతున్నారు సారూ అంటూ చురకలంటించారు. రిప్లై లేఖలో ముఖ్యమంత్రికి నెలకు రూ.3,36,000 చెల్లిస్తున్నట్టు సింగిల్ లైన్ లో చెప్పింది ప్రభుత్వం. అలాగే, మీ దరఖాస్తులో కోరిన సమాచారం 3 నుండి 10 వరకు సచివాలయంలోని వివిధ విభాగాలకు సంబంధించినదని.. సంబంధిత విభాగాలకి వేర్వేరు దరఖాస్తులను ఫైల్ చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఫైరయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి