Bihar: బీహార్ పోలీసులు శుక్రవారం ఓ భారీ కేసును ఛేదించారు. ముగ్గురు సభ్యుల స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం “కాలిఫోర్నియం” ని (Radioactive Californium Stone) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ధర గ్రాముకు రూ. 17 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంటే పోలీసులు నిందితుల దగ్గర సుమారు రూ. 850 కోట్ల సరుకు ఉన్నట్లు గుర్తించారు. అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ ఈ మెటీరియల్ ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.850 కోట్ల విలువైన అరుదైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియా స్టోన్‌తో ముగ్గురు స్మగ్లర్లను గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు శుక్రవారం ఒక అధికారి తెలిపారు. గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ ఈ మెటల్ రికవరీని ధృవీకరించి వివరాలను తెలియజేశారు.
అంతేకాకుండా నిందితులు 50 గ్రాముల డ్రగ్స్‌ను కూడా స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారులు గుర్తించారు. జిల్లాలో విలువైన వస్తువు స్మగ్లింగ్‌పై పక్కా సమాచారం అందడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. తదనంతరం, మేము డిస్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ , స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్-7 , స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో సహా వివిధ ప్రత్యేక విభాగాల సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. దాంతో నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తుండగా.., వారి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు, 50 గ్రాముల కాలిఫోర్నియా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: 5 కిలోల బంగాళదుంపలు లంచం అడిగిన ఎస్సై..సస్పెండ్ చేసిన అధికారులు!
పదార్థాన్ని పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుండి ప్రత్యేక బృందాన్ని పిలిచినట్లు పోలీసు అధికారి ఒకరు వివరించారు. . పదార్థం తీవ్రమైన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమగ్ర దర్యాప్తు కోసం చర్యలు తీసుకోవాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కి తెలియజేశారు. భారతదేశంలో అణు పదార్థాలను పర్యవేక్షించే బాధ్యత DAE కేంద్రంగా ఉన్నందున, ఈ చర్య పరిస్థితి తీవ్రతను నొక్కి చెబుతుంది.గోపాల్‌గంజ్ ఎస్పీ మాట్లాడుతూ.., కాలిఫోర్నియా చాలా ఖరీదైన రేడియోధార్మిక పదార్థమని, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒక్కో గ్రాము ధర సుమారు రూ. 17 కోట్లు ఉంటుందని, మొత్తం 50 గ్రాముల రాయి ధర సుమారు రూ. 850 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పుకొచ్చారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, స్మగ్లర్లు ఈ విలువైన పదార్థాన్ని విక్రయించడానికి చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ఈ కేసులో నిందితులను కూడా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లాలోని తమ్‌కుహి రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సౌని బుజుర్గ్ గ్రామానికి చెందిన ఛోటే లాల్ ప్రసాద్ (40), కౌశల్య చౌక్‌లో నివాసం ఉంటున్న చందన్ గుప్తా (40), గోపాల్‌గంజ్‌లోని నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న చందన్ రామ్, గోపాల్‌గంజ్‌కు చెందిన కుషహర్ మథియాను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.