Illegal liquor: ఏపీలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం.. రూ. 36 లక్షలు నేలపాలు!

తిరుపతిలో రూ. 36 లక్షల విలువచేసే అక్రమ మద్యంను పోలీసులు సీజ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 5వేలకుపైగా లీటర్ల మద్యంను రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

New Update
Illegal liquor: ఏపీలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం.. రూ. 36 లక్షలు నేలపాలు!

Illegal liquor in Tirupati: ఏపీలోని తిరుపతి జిల్లాలో భారీగా అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమంగా రవాణా చేయాలనుకున్న మద్యం మిగిలిపోవడంతో ఇటీవల తరలిస్తుండగా పట్టుకుని తిరుపతి బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్ వద్ద రోడ్ రోలర్ ద్వారా తొక్కించి ధ్వంసం చేశారు. దాదాపు రూ. 36 లక్షల విలువచేసే 5వేలకుపైగా లీటర్ల 27,568 బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. క్వార్టర్, ఆఫ్, ఫుల్ బాటిల్లతోపాటు క్యాన్ లను ధ్వంసం చేశారు. ఇదే క్రమంలో జిల్లాలోని 7 నియోజక వర్గాల్లోని పోలీస్ స్టేషనల్లో 3 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యంను ఎవరు సరాఫరా చేసిన కఠినంగా శిక్షిస్తాని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కోర్టు ఆదేశానుసారం సీజ్ చేసిన మద్యం బాటిల్లను ధ్వంసం చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు