Euro Cup 2024: జర్మనీలో నేటి నుంచి యూరో కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లు ప్రారంభం!

యూరోపియన్ దేశాల మధ్య యూరో కప్ ఫుట్‌బాల్ పోటీలు నేడు జర్మనీలో ప్రారంభం కానున్నాయి.దాదాపు 3000 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ సహా 24 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. నేడు తొలి మ్యాచ్ అర్ధరాత్రి 12.30 గంటలకు జర్మనీ, స్కాట్‌లాండ్ మధ్య జరగనుంది.

Euro Cup 2024: జర్మనీలో నేటి నుంచి యూరో కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లు ప్రారంభం!
New Update

Euro Cup 2024 Starts in Germany: యూరోపియన్ దేశాల మధ్య యూరో కప్ ఫుట్‌బాల్ పోటీలు నేడు జర్మనీలో ప్రారంభం కానున్నాయి.దాదాపు 3000 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ సహా 24 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఈ లీగ్‌ లో 6 విభాగాలుగా జట్లను విభజించి మ్యాచ్ లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ అర్ధరాత్రి 12.30 గంటలకు జర్మనీ, స్కాట్‌లాండ్ మధ్య జరగనుంది.

26 వరకు లీగ్ మ్యాచ్‌లు, 29 నుంచి నాకౌట్ రౌండ్ మ్యాచ్‌లు, ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌లో ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు  ప్రైజ్ మనీ లభిస్తుంది.అయితే ప్రపంచకప్ సిరీస్‌లో పాల్గొనే చాలా జట్లు ఇందులో పాల్గొనడంతో అంచనాలు పెరిగాయి.

Also Read: సెహ్వాగ్ ఎవరో నాకు తెలియదు..షకీబ్ అల్ హసన్!

#euro-cup-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe