RRR: జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు. తనపై కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా.. CID మాజీ ఛీఫ్ సునీల్ కుమార్ IPS, సీతారామాంజనేయులు IPS, వైఎస్ జగన్, అప్పటి CID అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ పేర్లను పేర్కొన్నారు.
Also Read: ఒక్కో టీచర్ నుంచి రూ. 3 నుండి 6 లక్షలు.. వర్ల రామయ్యా షాకింగ్ కామెంట్స్.!
అంతేకాకుండా, తనకు అయిన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటురు GGH సూపరింటెండెంట్ డా.ప్రభావతి పేరును కూడా పేర్కొంటూ RRR కంప్లైంట్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే.. తనను చంపేస్తానని పివి సునీల్ కుమార్ IPS బెదిరించారని ఫిర్యాదు చేశారు.