Railway Recruitment 2023: నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే అదిరే శుభవార్త.. టెన్త్ అర్హతతో 3,015 ఖాళీలకు నోటిఫికేషన్!

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే డబ్ల్యూసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

Railway Recruitment 2023: నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే అదిరే శుభవార్త.. టెన్త్ అర్హతతో 3,015 ఖాళీలకు నోటిఫికేషన్!
New Update

Railway Recruitment 2023:  మీరు పదో తరగతి పాసై, ఐటీఐ చేశారా? అయితే, మీకో శుభవార్త. చిన్న వయస్సులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించే సువర్ణావకాశం ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఈ వివరాలు మీకోసమే..

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే డబ్ల్యూసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

ఆర్‌ఆర్‌సీ డివిజన్‌/ యూనిట్‌లు: జేబీపీ డివిజన్, బీపీఎల్‌ డివిజన్, కోటా డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్‌, డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా, హెచ్‌క్యూ/ జేబీపీ.

ఖాళీల వివరాలు:

యాక్ట్ అప్రెంటిస్: 3,015 ఖాళీలు

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్‌లు: మెకానిక్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్‌స్మిత్‌, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫొటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్‌ కీపర్‌, మెషినిస్ట్‌, మాసన్‌, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ మొదలైనవి.

వయో పరిమితి: 14.12.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.136. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.36.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.12.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 14.01.2024.

#railway-recruitment-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe