Railway Calendar 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(Railway Recruitment Board) అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, నాన్-టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ సహా వివిధ రిక్రూట్‌మెంట్‌ల కోసం వార్షిక క్యాలెండర్(Railway Calendar 2024) ను విడుదల చేసింది. రైల్వేలో ఉద్యోగం(Railway Job) పొందడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వార్షిక క్యాలెండర్‌ను చూడవచ్చు.. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇదే షెడ్యూల్:
అధికారిక క్యాలెండర్ ప్రకారం, అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్(Assistant Loco Pilot) ప్రక్రియ జనవరి, 2024న ప్రారంభమైంది. మార్చి, 2024 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో, RRB టెక్నీషియన్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఏప్రిల్ నుంచి జూన్ 2024 మధ్య పూర్తవుతుంది. RRB నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు – గ్రాడ్యుయేట్ (లెవల్ 4, 5 & 6), గ్రాడ్యుయేట్ (లెవల్ 2 & 3) రిక్రూట్‌మెంట్ జూలై నుంచి సెప్టెంబర్ 2024 వరకు నిర్వహిస్తారు. జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ కేటగిరీల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జూలై నుంచి సెప్టెంబర్ 2024 వరకు జరుగుతుంది. లెవల్ 1, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీల కోసం రిక్రూట్‌మెంట్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహిస్తారు.
ఆర్‌ఆర్‌బీ జనవరి 20న ALP రిక్రూట్‌మెంట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ మొత్తం 5,696 ఖాళీలను భర్తీ చేయడం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లక్ష్యం. RRB ALP రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19. RRB ALP అప్లికేషన్ దిద్దుబాటు విండో ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 29, 2024 వరకు ఓపెన్ చేసి ఉంటుంది.
Also Read: ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!
WATCH: