ఈ మధ్యకాలంలోనే హార్లీ డేవిడ్ సన్, ట్రయంఫ్ వంటి కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే బైక్ లను భారత మార్కట్లోకి లాంచ్ చేశాయి. ఈ రెండు బైకులను 400సీసీ సెగ్మెంట్ లో మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటికి పోటీగా మరో బైక్ కూడా రాబోతోంది. దేశీయ మార్కెట్లో వాహనప్రియులను ఉర్రూతలూగిస్తున్న బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో టీజర్‌ను విడుదల చేసింది. రాబోయే రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త అవతార్ చిత్రాన్ని టీజర్‌లో స్పష్టంగా వెల్లడించనప్పటికీ, బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కావచ్చు అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ బైక్ ను జూలై 30న భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. న్యూజనరేషన్ బుల్లెట్ ఇప్పటికే టెస్టుల సమయంలో లీకులు బయటకు వచ్చాయి. ఈ బైక్ గురించి వివరంగా తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..యూత్ క్రేజీ బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్…ఫీచర్లు,ధర చూస్తే అవాక్కవ్వాల్సిందే..!!
యూత్ క్రేజీ బైక్‌గా ప్రాచుర్యం పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ 350...ఆదివారం భారత మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన స్టైలింగ్, శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉంటుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సరికొత్త బైక్‌గా రాబోతున్న బైక్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవేంటో చూద్దాం.

Translate this News: