యూత్ క్రేజీ బైక్.. రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్...ఫీచర్లు,ధర చూస్తే అవాక్కవ్వాల్సిందే..!!

యూత్ క్రేజీ బైక్‎గా ప్రాచుర్యం పొందిన రాయల్ ఎన్‎ఫీల్డ్ 350...ఆదివారం భారత మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన స్టైలింగ్, శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉంటుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సరికొత్త బైక్‌గా రాబోతున్న బైక్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవేంటో చూద్దాం.

New Update
యూత్ క్రేజీ బైక్.. రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్...ఫీచర్లు,ధర చూస్తే అవాక్కవ్వాల్సిందే..!!

ఈ మధ్యకాలంలోనే హార్లీ డేవిడ్ సన్, ట్రయంఫ్ వంటి కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే బైక్ లను భారత మార్కట్లోకి లాంచ్ చేశాయి. ఈ రెండు బైకులను 400సీసీ సెగ్మెంట్ లో మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటికి పోటీగా మరో బైక్ కూడా రాబోతోంది. దేశీయ మార్కెట్లో వాహనప్రియులను ఉర్రూతలూగిస్తున్న బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో టీజర్‌ను విడుదల చేసింది. రాబోయే రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త అవతార్ చిత్రాన్ని టీజర్‌లో స్పష్టంగా వెల్లడించనప్పటికీ, బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కావచ్చు అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ బైక్ ను జూలై 30న భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. న్యూజనరేషన్ బుల్లెట్ ఇప్పటికే టెస్టుల సమయంలో లీకులు బయటకు వచ్చాయి. ఈ బైక్ గురించి వివరంగా తెలుసుకుందాం.

కొత్త బుల్లెట్ 350.. క్లాసిక్ 350 మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది కానీ వేరే ఇంధన ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లు, సీటును కలిగి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 పై చాలా సులభంగా ప్రయాణం చేయవచ్చు. కొత్త మోటార్‌సైకిల్‌లో సింగిల్-పీస్ సీటు, చంకీ ఫెండర్‌లు, బాడీవర్క్‌పై పిన్‌స్ట్రైప్స్ ఉంటాయి.

ధర:
రాయల్ ఎన్ఫీల్డ్ తన హంటర్ 350ని రూ. 1.50 లక్షల నుండి రూ. 1.75 లక్షల శ్రేణిలో విక్రయిస్తోంది. కాగా, క్లాసిక్ 350 రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్య విక్రయిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, బుల్లెట్ 350 ధరలను ఈ రెండింటి మధ్య ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫీచర్లు:
ఈ కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్‌సైకిల్ సింగిల్-పీస్ సీటు, స్పోక్ రిమ్స్‌తో వస్తుంది. అదే సమయంలో, డిస్ ప్లే లైటింగ్ క్లాసిక్ 350 బైక్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్ స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్ కోసం చిన్న డిజిటల్ రీడౌట్‌తో చాలా సులభంగా ఉంటుంది. దీని ఛాసిస్ క్లాసిక్ 350తో షేర్ చేస్తుంది. ఈ బైక్ ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ లో ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లు ఉండే ఛాన్స్ ఉంది. ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ద్వారా బ్రేకింగ్ అవుతుంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వెనుక డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను కూడా విక్రయించవచ్చు.

ఇంజిన్:
ఇంజిన్‌లు క్లాసిక్ 350, హంటర్ 350, మెటోర్ 350కి శక్తినిచ్చే కొత్త J-సిరీస్ మోటార్‌ను పొందడం వల్ల 2023 బుల్లెట్ 350కి ఒక లేటెస్ట్ అప్ డేట్ తో వస్తుంది. 349సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ యూనిట్ 20బిహెచ్‌పి 27ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు