MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఈడీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. కాగా కవిత బెయిల్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.
కోర్టులో ఈడీ వాదనలు ఇలా..
* కవిత పాత్రపై, లిక్కర్ స్కాం కుట్ర పై మా వద్ద కావాల్సిన ఆధారాలు ఉన్నాయి
* సుప్రీం కోర్టులో కవిత తరపున ఉన్న పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు
* కవిత ను అరెస్ట్ చెయ్యమని ఈడి ఎటువంటి అండర్ టేకింగ్ ఇవ్వలేదు
* కవిత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ లో తన ఇంటికి వచ్చి విచారణ చేయాలని కోరారు
* సుప్రీం కోర్టు కవితకు అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు
* కవతను చట్టానికి లోబడి అరెస్ట్ చేశాం.. రూల్స్ ఫాలో అయ్యాం
* బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ ల వాంగ్మూలం తర్వాతే కవితను అరెస్ట్ చేశాం
* నూతన మద్యం పాలసిలో మద్యం వ్యాపారులకు లాభం కలిగేలా నిబంధనలు చేర్చారు
* అరుణ్ పిళ్ళై కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం లో (ప్రాక్సీ) బినామీగా వ్యవహరించారు
* సూర్యాస్తమయం లోపే కవితను అరెస్ట్ చేసి.. 24 గంటల్లో కోర్టులో హాజరు పరిచాం
* కవిత అరెస్ట్ సందర్భంగా ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు
* ఈడి కి దేశంలో ఎటువంటి పరిమితులు ఉండవు
* PMLA కు ప్రత్యేక చట్టం ఉంది, ఈడి అల్ ఇండియా ఇన్వెస్టిగేషన్ అథారిటీ
* అరుణ్ పిళ్లై లిక్కర్ స్కాం లో కవితకు బినామీ
* ఇండోస్పిరిట్ లో కవిత 32.5 శాతం వాటాదారులుగా ఉన్నారు
* కవితకు రెప్రజెంటేటివ్ గా పిళ్లై వ్యవహరించారు
* లిక్కర్ కేసులో కవిత పాత్ర పై అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చాడు
* దినేష్ అరోరా వంద కోట్ల వ్యవహారం పై విచారణ సందర్భంగా పలు విషయాలు చెప్పాడు
* బుచ్చిబాబు ఫోన్ లోని నోట్స్ లో లిక్కర్ స్కాం వ్యవహారంపై మరింత సమాచారం దొరికింది
* నగదు లావాదేవీలు, కుట్ర ఈ రెండు అంశాలు లిక్కర్ కేసుకు వర్తిస్తాయి