/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lr-jpg.webp)
Roja: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు మంత్రి రోజా థ్యాంక్స్ చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామనే ఉద్దేశ్యంతో మాట్లాడబోయి, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని అంటూ లోకేష్ పొరపాటున మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి ఈరోజు అరెస్టు అయ్యారు, @ncbn ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆయన చేసిన అన్యాయాన్ని గడపగడపకి @YSRCParty వెళ్ళి తెలియజేస్తుంటే మేము కూడా గడపగడపకు వెళ్లి ప్రతిమనిషికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని చెబుతాము అని చెప్పినందుకు… pic.twitter.com/AIXVVG9Syr
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 6, 2023
'చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి ఈరోజు అరెస్టు అయ్యారు, చంద్రబాబు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆయన చేసిన అన్యాయాన్ని గడపగడపకి వైసీపీ వెళ్ళి తెలియజేస్తుంటే, మేము కూడా గడపగడపకు వెళ్లి ప్రతిమనిషికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని చెబుతామని చెప్పినందుకు థాంక్యూ.. లోకేశ్. ఇప్పటికైనా మీ తండ్రి చేసిన తప్పుల్ని, ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పడమే కాదు ప్రజల్ని క్షమించమని అడిగితే ఇంకా బాగుంటుంది..!!' అంటూ ట్వీట్ చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు అన్యాయాన్ని చెబుతామని అంటున్నారని, ఇందుకు ఆయనకు థ్యాంక్స్ అని వైసీపీ నేత, మంత్రి రోజా అన్నారు. శుక్రవారం రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామనే ఉద్దేశ్యంతో మాట్లాడబోయి, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని అంటూ పొరపాటున మాట్లాడారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ను రోజా ట్వీట్ చేస్తూ, లోకేశ్‌కు థ్యాంక్స్ చెప్పారు.