Rohit: రోహిత్‌ శర్మకు పెరుగుతున్న మద్దతు.. నిన్న హర్భజన్‌..ఇవాళ రహానే..!

రోహిత్ శర్మపై టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా రోహిత్ ఆటగాళ్లందరికీ స్వేచ్ఛనిస్తాడని.. హిట్‌మ్యాన్‌కు గొప్ప కెప్టెన్‌కు ఉండాల్సిన మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

New Update
Rohit: రోహిత్‌ శర్మకు పెరుగుతున్న మద్దతు.. నిన్న హర్భజన్‌..ఇవాళ రహానే..!

WTCఫైనల్‌ ఓటమి తర్వాత కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ విఫలమయ్యాడంటూ పలువురు మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు అభిప్రాయపడగా..తాజాగా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే తన లీడర్‌కి మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడడం చాలా గొప్ప అనుభూతి కలిగిస్తుందన్నాడు రహానే. ప్లేయర్లందరికీ రోహిత్‌ పూర్తి స్వేచ్ఛ ఇస్తాడని.. గేమ్‌పై ఫోకస్ పెట్టేలా చూస్తాడని చెప్పాడు. గొప్ప కెప్టెన్‌కి ఈ లక్షణం ఉండాలని.. ప్లేయర్లకు స్వేచ్ఛని ఇచ్చి, వారిని ప్రొత్సహిస్తూ ఉండాలంటూ రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు రహానే. వెస్టిండీస్‌ సిరీస్‌కు టైమ్‌ దగ్గర పడుతున్న వేళ మీడియాతో ముచ్చటించిన రహానే తన కెప్టెన్‌ పట్ల విశ్వాసం ప్రదర్శించడం పట్ల నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రహానే కరెక్ట్‌గా చెప్పాడని కొందరు అంటుండగా.. రోహిత్‌ మెప్పు కోసం ఇలా మాట్లాడడాని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

publive-image రహానే, రోహిత్ (ఫైల్)

రోహిత్‌కి మద్దతిచ్చిన భజ్జి:
టీమ్‌ మొత్తం విఫలమైన చోటా ఒక కెప్టెన్‌ని మాత్రమే నిందించడం తగదు..అలానే టీమ్‌ సమిష్టిగా రాణించి గెలిచిన టైమ్‌లో కెప్టెన్‌ ఒక్కడికే క్రెడిట్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇదే విషయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌..! WTC ఫైనల్‌ ఓటమికి కేవలం రోహిత్‌ ఒక్కడినే బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదన్నాడు. ఐపీఎల్‌లో ముంబై డ్రెస్సింగ్‌ రూమ్‌లో రోహిత్‌తో కలిసున్న హర్భజన్‌..అతని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ చాలా గొప్ప కెప్టెన్‌ అని..అతనికి కొంచెం స్వేచ్ఛ ఇస్తే అద్భుతాలు చేయగలడన్న విషయం ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్‌ అయ్యిందన్నాడు హర్భజన్‌ సింగ్‌.

publive-image హర్భజన్ సింగ్ (ఫైల్)

రోహిత్‌కి బీసీసీఐ సపోర్టు ఉందా.?
రోహిత్‌కి సపోర్టుగా భజ్జి చేసిన వ్యాఖ్యలు బీసీసీఐకి కౌంటర్ ఇచ్చేలా ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న దాల్మియా దాదాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని..అలాగే ధోనీ సారధ్య బాధ్యతలు చేప్పటిన సమయంలో నాటి బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అండదండలు అందించారని..తర్వాత కోహ్లీకి కూడా వినోద్‌ రేయ్‌ మద్దతుగా నిలిచాడని చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్. అయితే రోహిత్‌ శర్మకు బీసీసీఐ నుంచి అలాంటి మద్దతు ఎంత వరకు ఉందో తనకు తెలియదంటూ పరోక్షంగా బీసీసీఐకి భజ్జి చురకలంటించాడన్న ప్రచారం జరుగుతోంది. వన్డే ప్రపంచకప్‌కు మరో మూడు నెలలు సమయం మాత్రమే ఉండడంతో రోహిత్‌కి బీసీసీఐ సపోర్ట్ అవసరమని చెప్పాడు భజ్జి.

వెస్టిండీస్‌ టూర్‌కి ఆల్‌ సెట్:
వెస్టిండీస్ ప‌ర్య‌ట‌నలో భార‌త జ‌ట్టు తొలి టెస్టుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఓట‌మి తర్వాత జరగనున్న ఈ సిరీస్‌ టీమిండియాలో స్థానం ఆశిస్తున్న జూనియర్లకు ఎంతో కీలకం కానుంది. ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జట్టులో చోటు కోసం సంజూ శాంస‌న్, ఇషాన్ కిష‌న్ పోటిపడుతుండగా..ఈ ఇద్దరికి విండీస్ టూర్ పెద్ద సవాల్‌ అంటున్నారు విశ్లేషకులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు