భాగ్యనగరంలో కుంగిపోయిన రోడ్డు.. ఈసారి ఎక్కడంటే? హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఉన్నట్టుండి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దాదాపు రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో గుంత ఏర్పడింది. దీంతో అటు వైపు వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అటు వైపు ఎవ్వరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 11 Oct 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఉన్నట్టుండి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దాదాపు రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో గుంత ఏర్పడింది. దీంతో అటు వైపు వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అటు వైపు ఎవ్వరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రోడ్డుపై ఉన్నట్టుండి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దాదాపు రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో గుంత ఏర్పడింది. ఆ సమయానికి వాహనాదారులు అటు వైపు ఎవ్వరూ వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన స్ధానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్ధాలానికి చేరుకున్న అధికారులు అప్రమత్తమై బారికేడ్లు ఏర్పాటు చేసారు. అటు వైపు వెళ్లాల్సి ఉన్న వాహనదారులు గుంత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఆ మార్గంలో వాహనాలు మెల్లిగా కదులుతున్న పరిస్ధితి ఏర్పడింది. దీంతో అధికారులపై స్ధానికులు మండిపడుతున్నారు. కేవలం అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు ఈ పరిస్ధితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ప్రధానంగా నాలా పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుంగిపోయి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ప్రాణనష్టం సంభవించకపోయినా.. కాళ్ల కింద భూమి కుంగిపోవడంతో.. వాహనదారులు, పాదచారులు హడలిపోతున్నారు. Also Read: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష..!! #hyderabad #road-collapses-in-dilsukhnagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి