/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/road-jpg.webp)
Road Accident Video: రోడ్డుపైనే కాదు రోడ్డు పక్కన నడవాలంటే కూడా ప్రజలు భయపడుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్నా, ప్రాణాలకు నో గ్యారంటీ అనే విధంగా కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘోర ప్రమాదం ఒకటి కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. వాహనదారులు ఎంతో జాగ్రత్తగా నడపాలనే సూచన చేశారు.
మంగళూరు పట్టణంలో డివైడర్ రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై నలుగురు యువతులు ఒకే బృందంగా నడిచి వెళుతున్నారు. ఆ సమయంలో వారు వెను దిరిగి చూసుకునే క్షణంలోనే వేగంగా వచ్చిన కారు వారిపై నుంచి దూసుకుపోయింది. కారు ఢీకొన్న వేగానికి వారు ఎగిరి పడ్డారు. వారి మీదుగా కారు ముందుకు వెళ్లి పోయింది. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో మహిళను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
Also Read: ఉగ్రవాదులతో 20 గంటలు కాలక్షేపం..ఆ తర్వాత..!!
మితిమీరిన అతివేగం, ఆజాగ్రత్తే ఇలాంటి ఘోర ప్రమాదాలకు కారణం. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతాయి.
కర్ణాటకలోని మంగళూరులో నిన్న జరిగిందీ ఘోర రోడ్డు ప్రమాదం. ఈ యాక్సిడెంట్ లో ఒక మహిళ… pic.twitter.com/kiVTJtDIul
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 19, 2023
వాహనదారులు ఎంతో జాగ్రత్తగా నడపాలనే సూచించారు. ‘‘మితి మీరిన వేగం, అజాగ్రత్తే ఇలాంటి ఘోర ప్రమాదాలకు కారణం. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడతాయి’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.