నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నల్గొండ జిల్లా నిడమనూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఆటోను బలంగా ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పెద్దపుర మండలం పుల్యతండాకు చెందిన వారిగా గుర్తించారు.

New Update
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Yadadri Bhuvanagiri : దేశ వ్యాప్తంగా రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. ఎన్ని కఠినమైన ట్రాఫిక్ రూల్స్ పెట్టినప్పటికీ వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. ఈ క్రమంలో అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. నిద్ర లేకుండా రాత్రంతా డ్రైవింగ్ చేయడంతోపాటు మద్యం మత్తులోనూ కార్లు, లారీలు వేసుకుని రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. మరికొంతమంది సెల్ ఫోన్(Cell Phone) చూస్తూ బండ్లు నడుపుతూ యాక్సిండెంట్లకు కారణమవుతున్నారు. కొన్నిసార్లు అతి వేగంగా నడుపుతూ వాహనాలు బోల్తా కొట్టి ప్రాణాలిడుస్తున్నారు. ఇలాంటి ఓ భయంకరమైన ఘటన నల్గొండ జిల్లా(Nalgonda District) నిడమనూర్ వద్ద చోటుచేసుకుంది. అవసరానికి మించి వేగంగా వెళ్తున్న ఓ వాహనం  మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ఓటీటీలోకి ‘యానిమల్‌’.. మరో 9 నిమిషాల నిడివి పెంచుతున్న డైరెక్టర్!

ఈ మేరకు నల్గొండ జిల్లా నిడమనూరు వద్ద సోమవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. దాదాపు 7 గంటల ప్రాంతంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ లారీ ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో వెహికిల్ బోల్తా పడటంతోపాటు ప్రమాదానికి గురైన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసుసు సంఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పెద్దపుర మండలం పుల్యతండాకు చెందిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు