ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం..స్కూల్ బస్సు, కారు ఢీకొని ఆరుగురు మృతి..!! ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతోపాటు ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు. విజయ్ నగర్, టిగ్రీ ఎక్స్‌ప్రెస్‌వేపై స్కూల్ బస్సు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. By Bhoomi 11 Jul 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు, కారు (TUV) ఢీకొన్న ప్రమాదంలో 6 మంది మరణించారు. ఈ విషయాన్ని రూరల్ జోన్ డీసీపీ ధ్రువీకరించారు. NH 9లో లాల్కువాన్ నుండి ఢిల్లీకి వెళ్తున్న లేన్‌లోఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, డీఎంఈ బృందం సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటన క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ విహార్ ముందు జరిగింది. ఈ ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందంటే మృతదేహాలు కారులో ఇరుక్కుపోయి ఉండడంతో వారిని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కట్టర్‌తో కారు డోర్లను కోసి మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది. ఈ ప్రమాదంపై అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ రామానంద్ కుష్వాహ మాట్లాడుతూ.. 'ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై స్కూల్ బస్సు, టీయూవీ కారు ఢీకొన్నాయి. బస్సు డ్రైవర్ ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి సీఎన్‌జీ నింపుకుని రాంగ్ సైడ్ నుంచి వస్తున్నాడు. TUV లో కూర్చున్న వ్యక్తులు మీరట్ నుండి గుర్గావ్ వెళ్తున్నారు. రాంగ్ రూట్ లో వస్తున్న బస్సును కారు ఢీకొనడంతో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిపోతున్న బస్సు డ్రైవర్ ను పట్టుకున్నారు. కారులో మొత్తం 8 మంది ఉన్నారని డీసీపీ తెలిపారు. ఇందులో ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదానికి కారణమైన బస్సును నోయిడాకు చెందిన బాల్ భారతి స్కూల్ బస్సుగా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సు ఖాళీ ఉందని పోలీసులు తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి