దుబాయ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం..భారతీయుడు సహా సహా నలుగురు మృతి..!!

దుబాయ్‎లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. షార్జాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. కూలీలతో వెళ్తున్న వ్యాన్ భారీ ట్రక్కును ఈ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు పాకిస్థానీలు సహా ఒక భారతీయుడు అక్కడిక్కడే మరణించారు. షార్జా-అల్ దైద్ రోడ్డులో అల్ దైద్ బ్రిడ్జ్ అల్ జుబైర్ జిల్లా మధ్య బుధవారం ఉదయం 5.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఖలీజ్ టైమ్స్ నివేదించింది.

New Update
దుబాయ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం..భారతీయుడు సహా సహా నలుగురు మృతి..!!

దుబాయ్ షార్జాలో భారీ ట్రక్కు ఢీకొనడంతో పికప్ వ్యాన్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడు, ముగ్గురు పాకిస్థానీలు అక్కడికక్కడే మృతి చెందారు. షార్జా-అల్ దైద్ రోడ్డులో అల్ దైద్ బ్రిడ్జ్, అల్ జుబైర్ జిల్లా మధ్య బుధవారం ఉదయం 5.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఖలీజ్ టైమ్స్ నివేదించింది. షార్జా పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్దుల్లా అల్ దుఖాన్ మాట్లాడుతూ, పికప్ వాహనం షార్జా-దైద్ రహదారిలో హైవే కుడి వైపు చూడకుండా ప్రవేశించడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ కూడా అకస్మాత్తుగా లేన్‌లోకి వాహనం ప్రవేశిస్తుందని ఊహించలేదని..ట్రక్కును వ్యాను ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగిందని తెలిపారు.

sharjah road accident

ఈ ప్రమాదంలో వ్యాన్ ట్రక్కు క్యాబిన్ లో ఇరుక్కపోవడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని కల్నల్ అల్ దుఖాన్ తెలిపినట్లు ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అంబులెన్స్‌ను సంఘటనా స్థలానికి పంపించారు. నలుగురి మృతదేహాలను అల్ కువైట్ హాస్పిటల్ మార్చురీలో ఉంచినట్లు వెల్లడించారు.

అల్ దైద్ రోడ్డులో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల, అదే రహదారిపై కూలీలతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు ఆసియా వలసదారులు మరణించారు. 15 మంది గాయపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు