మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం..రెండు కంటైనర్లు ఢీకొని ఇద్దరు సజీవదహనం..!!

మెదక్ జిల్లాలో నార్సింగి సమీపం ఘోర ప్రమాదం జరిగింది. రెండు కంటైన్లు ఢీ కొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. నార్సింగి మండలం కాస్లాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం..రెండు కంటైనర్లు ఢీకొని ఇద్దరు సజీవదహనం..!!

మెదక్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి మండలం కాస్లాపూర్ జాతీయ రహదారిపై రెండు కంటైనర్లు ఢీకొన్నాయి. ఒక కంటైనర్ నుంచి మరొక కంటైనర్ వెనక నుంచి ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. వెనక ఉన్న కంటైనర్ లోని ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు.

medak accident

హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ ఇంజనీ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కంటైనర్ లోని ఇద్దరు సజీవదహనమయ్యారు.

మ్రుతులు కర్నాటకు చెందిన నాగరాజు, బసవరాజులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు