పశ్చిమకెన్యాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి పాదాచారులు, ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో 48మంది మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టీవీల్లో ప్రసారం అవుతున్న వీడియోల్లో క్రాష్ జరిగిన ప్రదేశంలో భయానకు ద్రుష్యాలు కనిపించాయి. మినీబస్సుల శిథిలాలు, బోల్తాపడిన ట్రక్కు కింద కొంతమంది చిక్కుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రమాదం తరువాత, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రమాదం తర్వాత ట్వీట్ చేశాడు “కెరిచో కౌంటీలోని లోండియానిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు దేశం సంతాపం తెలియజేస్తున్నాను. చనిపోయిన వారిలో కొందరు యువకులు ఉండటం విచారకరం. ప్రాణాలతో బయటపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము.” అంటూ ట్వీట్ చేశారు.
కాగా రిఫ్ట్ వ్యాలీకి చెందిన ప్రాంతీయ పోలీసు కమాండ్ మాట్లాడుతూ..కెరిఖో వైపు ప్రయాణిస్తున్న ట్రక్కు కంట్రోల్ తప్పి 8వాహనాలపైకి దూసుకెళ్లింది. రోడ్డుపక్కన ఉన్న దుకాణాలు, ఇతర వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలిపారు. లోండియాని జంక్షన్ అని పిలిచే రద్దీగా ఉండే ప్రాంతంలో సాయంత్రం 6గంటలు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్సులు, రెస్య్కూటీం కెన్యా రెస్ క్రాస్, భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగినట్లు తెలిపారు.