/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rtc-jpg.webp)
Karimnagar: ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నో రకాల భద్రతా చర్యలను చేపడుతూ, అమలు చేస్తున్నప్పటికీ.. ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో.. ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య పెరుగుతుండటమే కాకుండా ప్రభుత్వాలపై ఆర్థిక భారం కూడా పడుతోంది.
Also Read: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్
తాజాగా, కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. బస్సులో ఉన్న దాదాపు 20 మందికి గాయాలు అయినట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి వరంగల్ వైపు వెలుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సంఘటనకు సంబందించిన పూర్తి వివరలు తెలియాల్సి ఉంది.
Also read: సీఎం ఫైనల్ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్.. హైకమాండ్ ఎవరి వైపు?