Crime News: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్‌ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలోని హైవేపై ఘటన చోటుచేసుకుంది.

New Update
Crime News: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Anathapuram Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రావెల్స్‌ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో హైవేపై ఘటన చోటుచేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన

ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు గుత్తి మండలం మాముడూరుకు చెందిన చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జు, శ్రీనివాసులుగా గుర్తించారు. ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని తిరిగి మాముడూరుకు బియ్యం లోడ్‌తో వెళ్తుండగా ట్రాక్టర్ ను..  ప్రైవేట్ వోల్వో బస్సు అతివేగంతో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Also read: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. వ్యూహం సినిమాకు చెక్ పెట్టిన కోర్టు..

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలంకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. నలుగురి మృతిపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు