ఐపీఎల్ లో చెన్నై గూటికి పంత్ వెళ్లనున్నాడా?

IPL చెన్నైజట్టులో ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ధోనీ,సీఎస్కే సీఈవో తో పంత్ కు ఉన్నరిలేషన్ కారణమని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఇంటెర్నెట్ లో వస్తున్న పుకార్లను ఢిల్లీ మేనేజ్ మెంట్ ఖండించింది.

New Update
ఐపీఎల్ లో చెన్నై గూటికి పంత్ వెళ్లనున్నాడా?

CSK లెజెండ్ ధోని IPL మెగా వేలానికి ముందే రిటైర్ అవుతాడని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేనప్పటికీ, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు లేకపోవటంతో ఈ వార్తను సులభంగా అర్థం చేసుకోవచ్చు.అయితే చెన్నై జట్టులో ధోనీ స్థానాన్ని పంత్ భర్తీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రిషబ్ పంత్ గత కొన్నాళ్లుగా ధోనీతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. అదేవిధంగా, రిషబ్ పంత్ CSK జట్టు CEO సుందర్ రామన్‌ కు అత్యంత సన్నిహితుడు కూడా.దీంతో సీఎస్‌కే జట్టులో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

పంత్ ను CSK బదిలీ చేసేందుకు ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుందని అంతా భావించారు. అయితే ఈ వార్తలను ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ ఖండించింది. ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ కు మధ్య రిలేషన్ బాగానే ఉందని, రిషబ్ పంత్ ను వదులుకునే ఆలోచన లేదని సమాచారం. ప్రకటన రిషబ్ పంత్, అక్షర్ పటేల్ పేర్లను ఢిల్లీ జట్టు అట్టిపెట్టుకునే జాబితాలో టాప్ 2 ప్లేయర్స్‌గా ఉంటారని వెల్లడించింది. అదేవిధంగా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను కూడా రిటైన్‌ చేసుకోవాలని ఢిల్లీ జట్టు భావిస్తోందని, దాని కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. జేక్ ఫ్రేజర్, ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరిలో ఒకరిని ఢిల్లీ జట్టు అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడైంది. కానీ వారి వేతనాల నిర్ణయంలో ఇబ్బందులు తలెత్తడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో సీఎస్‌కేకి రిషబ్‌ బండ్‌ వచ్చే అవకాశం లేకపోవడం ఖాయం.

Advertisment
Advertisment
తాజా కథనాలు