RGV VYOOHAM : ఎట్టకేలకు మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల కానుంది. వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయి. టీడీపీ అభ్యంతరాలతో వ్యూహం సినిమా మూడు సార్లు సెన్సార్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలో 22 చోట్ల మ్యూట్లు, రెండు సన్నివేశాలు తొలగించినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను సెన్సార్ బోర్డు మార్పించిందని సమాచారం. జగన్ రాజకీయ జీవితాన్ని వ్యూహం పేరుతో ఆర్జీవీ తెరకెక్కించారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ వ్యూహం సినిమా మార్చి 2న రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి డెరెక్టర్ ఆర్జీవీ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ప్రతిష్టను దెబ్బతీసేలా..
రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) తీసిన ‘వ్యూహం'(Vyooham) సినిమా ఏపీ రాజకీయాల్లో(AP Politics) సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్(Sensor Certificate) ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో చాలా వరకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా.. రాజకీయ ఎజెండాతో వ్యూహం సినిమాను రూపొందించారని, దీనిని అడ్డుకోవాలని లోకేష్ కోరారు. ఈ రిట్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్ట్ లో విచారణ జరిగింది.
ఎదురుదెబ్బ..
Y.S రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) మరణం తర్వాత జగన్(YS Jagan) పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా RGV ఈ సినిమాను తెరెకెక్కించారు. RGV ‘వ్యూహం’ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు విడుదలకు సంబందించిన తేదీలను కూడా గతంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు ఆర్జీవీ. అయితే, లోకేష్ పిటిషన్ వేయడంతో డైరెక్టర్ కు ఎదురుదెబ్బ తగిలింది. సినిమా విడుదలకు బ్రేక్ పడింది.
Also Read: విహారిని అందుకే పీకేశాం.. ఏసీఏ సంచలన లేఖ!
2009 నుంచి 2014 వరకు జగన్ కుటుంబంలో, ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశించినట్లు ఈ సినిమా ఉందని ట్రైలర్ లో స్పష్టమవుతుంది. ఎన్నికలకు ముందు RGV ఈ సినిమా తేదీని విడుదల చేయడంతో రాజకీయ నాయకులలో, ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. జగన్ కు అనుకూలంగా తీస్తున్న ఈ సినిమా జగన్ రాజకీయ భవిష్యత్, ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందని చాలా ఆసక్తిగా పెంచుతుంది. రామదూత క్రియేషన్స్ పతాకంపై వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్, భారతీగా మానస నటిస్తున్నారు.