/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rgv-complaint-jpg.webp)
Ram Gopal Varma: ఓ టీవీ ఛానెల్‌లో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivasa Rao) షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. RGV తల నరికి తెచ్చిన వారికి కోటీ రూపాయలు ఇస్తానంటూ సవాల్ చేశారు. దీనిపై ఘాటుగానే స్పందించిన ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
ఆర్జీవీ ఏం అన్నారంటే?
నిన్న రాత్రి టీవీ5(తెలుగు మీడియా ఛానెల్)లో కొలికిపుడి శ్రీనివాస్ డిబేబ్‌లో నన్ను చంపడానికి సూపారి ఇస్తానంటూ అతను కామెంట్స్ చేసినా .. ఆ డిబేట్‌ని యాజమాన్యం కొనసాగించడం తప్పు అని ఆర్జీవీ ఫైర్ అయ్యారు. అతను మాటలు తప్పు అని కూడా ఎవరు ఖండించలేదని RGV మండిపడ్డారు. ఎప్పుడూ నన్ను చంపడానికి ఎవరు సూపారి ఇవ్వలేదని అందుకే ఇప్పటివరకు తాను కంప్లైంట్ చెయ్యలేదని చెప్పారు ఆర్జీవీ. అయితే కొలికిపుడి శ్రీనివాస్ రావు, యాంకర్ సాంబశివ రావు ,టీవీ 5 ఛానెల్ ఎండీ బీఆర్ నాయుడు (B.R.Naidu) మీద కంప్లైంట్ ఇచ్చానని తెలిపారు. ప్రోసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారన్నారు.
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
వ్యూహం అనే సినిమా అది నా పొలిటికల్ కాన్సెప్ట్ అని.. మీరేమి తప్పు చెయ్యనప్పుడు భయపడటం ఎందుకని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వీళ్లంతా ఎందుకు భుజాలు తడుముకుంటుంన్నారని క్వశ్చన్ చేశారు.
Also Read: ఆర్జీవీ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాస్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వర్మ
WATCH: