Kolkata Case : నాకేం తెలియదు.. నేను వెళ్లేసరికే ఆమె చనిపోయింది! అభయ హత్యాచార కేసులో ప్రస్తుతం అరెస్టై జైల్లో ఉన్న రాయ్‌కు సీబీఐ పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు సదరు కథనాలు వివరించాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. By Bhavana 27 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Kolkata Junior Doctor Case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా (Kolkata) ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో నిందితుడు అసత్యచ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ పరీక్షను ఆదివారమే నిర్వహించినప్పటికీ నిందితుడు చెప్పిన వివరాలను, సమాధానాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే, పాలీగ్రాఫ్ పరీక్ష (Polygraph Test) లో నిందితుడు అసత్య, పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. తాను వెళ్లేసరికే అభయ చనిపోయిందని అతడు తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇక ఈ పాలీగ్రాఫ్ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు సదరు కథనాలు వివరించాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. దర్యాప్తు బృందం ఆధారాలు చూపించినప్పుడు, ఆ సమయంలో తాను అక్కడ లేనని నిందితుడు చెప్పినట్లు తెలిపాయి. అంతేగాక, తాను సెమినార్ హాల్‌కు వెళ్లేసరికి వైద్యురాలు చనిపోయి ఉందని, భయంతో తాను అక్కడి నుంచి పారిపోయానని ప్రధాన నిందితుడు సంజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ హత్యాచార కేసులో ప్రస్తుతం అరెస్టై జైల్లో ఉన్న రాయ్‌కు కోర్టు ఆదేశాలతో సీబీఐ (CBI) పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం అతడు కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉండగా అక్కడే ఈ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. మరోవైపు నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరఫు డిఫెన్స్ లాయర్ అక్కడ లేకపోవడం కూడా ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నిందితుడి తరుఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని వారు ఆరోపించారు. Also Read: ఈ నెల 31 వరకు భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు! #rg-kar-medical-college #abhaya-case #kolkata-junior-doctor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి