ఈ రోజు కాంగ్రెస్ (Congress) నిర్వహించే తుక్కుగూడ జన జాతర సభలో ఆ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయన్న ప్రచారం సాగింది. 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాహుల్ సభలో హస్తం గూటికి చేరుతారన్న చర్చ జోరుగా సాగింది. అయితే.. చేరికల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాహుల్ గాంధీ సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ రోజు మీటింగ్ లో ఎలాంటి చేరికలు వద్దని రాహుల్ రేవంత్ కు చెప్పినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాహుల్ ఆదేశాలతో రేవంత్ అండ్ టీమ్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Addanki Dayakar : అద్దంకికి మళ్లీ షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే?
సభలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్నారు. ఒక వేళ చేరికలు జరిగితే.. చర్చంతా చేరికల చుట్టే సాగుతుందని.. మేనిఫెస్టో అంశాలు జనాల్లోకి వెళ్లవని రాహుల్ చెప్పినట్లు సమాచారం. గతంలో 6 గ్యారంటీలను తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో గెలుపు సెంటిమెంట్‌తో తుక్కుగూడ వేదిక నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభిస్తోంది.
25 మంది ఎమ్మెల్యేలు వస్తారన్న ఉత్తమ్..
మరోవైపు చేరికలపై మంత్రి ఉత్తమ్ ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోకి 12 మంది కాదు 20 నుంచి 25 మంది వస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తీరు వల్లే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. దీంతో ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరూ? అన్న చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.